తమిళ నటి విజయలక్ష్మి ఆత్మహత్యాయత్నం చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. పలు తెలుగు సినిమాల్లో కూడా నటించిన విజయలక్ష్మి ఇటీవల పలు వివాదాలతో వార్తల్లోకి వచ్చారు. తన ఆర్థిక పరిస్థితి ఏం బాగోలేదని కొంతకాలం కిందట ఆమె ప్రకటించారు. ఆ సమయంలో కొందరు ఆమెకు సాయం చేసినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే అలా సాయం చేసిన వారు కూడా తనను మరో రకంగా ఉపయోగించుకోవాలని చూసినట్టుగా విజయలక్ష్మి ఆ తర్వాత ఆరోపించింది.
తాజాగా ఆమె ఆత్మహత్యాయత్నం చేసిందని, ఆసుపత్రి పాలైందని వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఆమె తమిళ దర్శకుడు సీమన్ మీద తీవ్ర ఆరోపణలు చేసింది. సీమన్, అతడి ముఠా తనను వేధిస్తోందని ఆమె ఆరోపించింది. తీవ్ర తమిళ వాదిగా పేరు పొందాడు ఈ సీమన్ అనే వ్యక్తి. ఎల్టీటీఈతో కూడా ఈయనకు సంబంధాలు ఉండేవంటారు.
ఎల్టీటీఈ ప్రభాకర్ సాయంతోనే సీమన్ ఎదిగాడని అంటారు. ఈ క్రమంలో తనను సీమన్ వేధిస్తున్నాడని విజయలక్ష్మి ఆరోపించింది. తనది కూడా ఎల్టీటీఈ ప్రభాకరన్ క్యాస్టే అని, తాము కూడా పిళ్లైలమని, అయినా తనను సీమన్ వేదిస్తున్నాడని, ప్రభాకర్ సహకారం లేకపోయి ఉంటే సీమన్ ఈ రోజు ఎవరు? అంటూ ఆ మధ్య ఒక వీడియో కూడా పోస్టు చేసిందట విజయలక్ష్మి.
తమిళంలో పలు సినిమాల్లో నటించిన ఈమె తెలుగులో శ్రీహరి హీరోగా నటించిన ఒక సినిమాలో హీరోయిన్ గా నటించింది. హనుమాన్ జంక్షన్ సినిమాలో హీరోలు అర్జున్, జగపతిబాబులకు చెల్లెలి పాత్రలో కనిపిస్తుంది. అనువాద సినిమా 'నేనే అంబానీ' ద్వారా కూడా తెలుగు వారికి కనిపించింది.