రవి ప్రకాష్ ను పట్టించుకునే వారు లేనట్టే!

ఈ మధ్యనే పుట్టిన రోజును  గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నాడట టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్. ఆ సందర్భంగా ఒక ప్రముఖ టీవీ యాంకర్ తెగ హంగామా చేశాడట. తను పనిచేసిన సంస్థ లోగోలను…

ఈ మధ్యనే పుట్టిన రోజును  గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నాడట టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్. ఆ సందర్భంగా ఒక ప్రముఖ టీవీ యాంకర్ తెగ హంగామా చేశాడట. తను పనిచేసిన సంస్థ లోగోలను అమ్ముకుని ఆ సంస్థను దెబ్బతీయాలని చూసిన వ్యక్తి ఇంటికి వెళ్లి ఆ యాంకర్ తెగ డ్యాన్సులు వేశారట. దీంతో ఆ యాంకర్ ను సాగనంపారని టాక్! 

ఇక బీజేపీ వాళ్లు న్యూస్ చానళ్లు ప్రారంభించనున్నారట.. వాటికి రవిప్రకాషే అంతా అట.. అనే లీకులను మాత్రం బాగానే వదులుతున్నారని సమాచారం. అలా ఉనికి పాట్లు పడుతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతానికి అయితే రవి ప్రకాష్ ను నమ్మి కోట్లు పెట్టుబడులు పెట్టి, వార్తా చానళ్లను ప్రారంభించే వారులేరని సమాచారం. ఆల్రెడీ టీవీ నైన్ యాజమాన్యంతో రవిప్రకాష్ వ్యవహరించిన తీరుతో.. కొత్త వాళ్లు ఎలా నమ్మి పెట్టుబడులు పెడతారనేది కామన్ సెన్స్ తో కూడుకున్న ప్రశ్న. దానికి సమాధానమూ ఆ ప్రశ్నలోనే ఉంది.

మరి ఈ ఖాళీ సమయంలో ఏం చేస్తున్నారు? అంటే.. కుట్రలకు పదును పెడుతున్నారని సమాచారం. తన అధిపత్యానికి పూర్తిగా చెక్ పంపించిన యాజమాన్యంపై నెగిటివ్ పబ్లిసిటీలు చేయడానికి రవి ప్రకాష్ ఆధ్వర్యంలో కుట్రకుతంత్రాలు అమలవుతున్నాయనేది అభిజ్ఞ వర్గాల సమాచారం!

దానికితోడు గరుడపురాణం శివాజీ కూడా తోడయ్యారట. ఇద్దరి పరిస్థితి దాదాపు ఒకటే కాబట్టి.. తమను ఆ గతికి తీసుకొచ్చారంటూ.. కొంతమంది మీద, ఏపీ ప్రభుత్వం మీద వారు తెగ కారాలూ మిరియాలూ నూరుతున్నారని, విష ప్రచారాలు సాగించడానికి ప్రయత్నాలు చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తూ ఉన్నాయి.

కులబాంధవుల చేతిలో అధికారం ఉన్నప్పుడే వీళ్ల ప్రచారం పప్పులు ఉడకలేదు, ఇప్పుడు ఏమవుతుంది? అనే ప్రశ్ననూ వేస్తున్నారు పరిశీలకులు.  

బాహుబలి వేసిన బాటలో నడిచాడు 'సైరా'