తనపని తాను చేసుకుపోతున్న జగన్‌.!

ఐదేళ్ళక్రితం ప్రత్యేక పరిస్థితుల్లో ఏర్పడ్డ కొత్త రాష్ట్రం.. అందులోనూ కుప్పలు తెప్పలుగా అప్పులు.. అత్యంత అధ్వాన్నంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి.. ఇన్ని ప్రతికూలతల మధ్య ప్రభుత్వాన్ని నడపడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఐదేళ్ళు…

ఐదేళ్ళక్రితం ప్రత్యేక పరిస్థితుల్లో ఏర్పడ్డ కొత్త రాష్ట్రం.. అందులోనూ కుప్పలు తెప్పలుగా అప్పులు.. అత్యంత అధ్వాన్నంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి.. ఇన్ని ప్రతికూలతల మధ్య ప్రభుత్వాన్ని నడపడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఐదేళ్ళు చంద్రబాబు, రాష్ట్రాన్ని ఏం ఉద్ధరించారు.? అన్న విషయాన్ని పక్కన పెడితే, కొత్త ప్రభుత్వమ్మీద మోయలేనంత భారం వుందన్నది మాత్రం నిర్వివాదాంశం. ప్రత్యేకహోదా గురించి మాట్లాడుకోలేని దుస్థితి.. కేంద్రం నుంచి రాష్ట్రానికి సాయం అందని పరిస్థితి.

ఎలా.? రాష్ట్రానికి ముందుకు తీసుకెళ్ళడమెలా.? అన్న ప్రశ్నకు సమాధానం వెతకడంతోనే ఏళ్ళు గడిచిపోతాయి. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రభుత్వం తన పని తాను చేసుకుపోతోంది. నదుల్లో నీరు పుష్కలంగా ఉప్పొంగుతోందని సంతోషించాలో.. ఆ కారణంగా, ఇసుక లభ్యత తగ్గిపోవడం వల్ల నిర్మాణ రంగం కుదేలవుతున్నందుకు బాధపడాలో తెలియని పరిస్థితి. ఆ ఇసుక పేరుతో విపక్షాలు రాజకీయం చేయొచ్చుగాక.. కానీ, ప్రభుత్వానికి అదొక్కటే పనికాదు కదా.!

చేయగలిగినవి చిటికెలో చేసేస్తున్న వైఎస్‌ జగన్‌ సర్కార్‌, ఒకింత భారమైన పనులకు మాత్రం, కొంత గడవు తీసుకుంటోంది. 'వంద రోజుల్లోనే అన్నీ చేసేశాం..' అని కొందరు వైసీపీ నేతలు చెప్పుకోవచ్చుగాక. కానీ, అన్నీ చేసెయ్యడం సాధ్యమయ్యే పనికాదు. కానీ, నవరత్నాలకు సంబంధించి ఒక్కోదానికీ ఒక్కో డెడ్‌లైన్‌ని అయితే ఫిక్స్‌ చేయగలిగారు. నిజానికి, చంద్రబాబులా ఏదో ఒక పబ్లిసిటీ స్టంట్‌ చేసేసి, చేతులు దులిపేసుకునే అవకాశం జగన్‌కీ వున్నా, ఆయన ఆ పని చేయడంలేదు.

మరోపక్క, 2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్ని, 2019 ఎన్నికలకు ముందు వరకూ నెరవేర్చని తెలుగుదేశం పార్టీ, నాలుగు నెలల్లోనే వైఎస్‌ జగన్‌ సర్కార్‌.. అన్ని ఎన్నికల హామీల్నీ నెరవేర్చాయాలంటూ యాగీ చేసేస్తుండడం హాస్యాస్పదం కాక మరేమిటి.? ఈ మొత్తం వ్యవహారంలో, వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు తాను చెప్పదలచుకున్నది చెబుతున్నారు గానీ.. అదే విషయాన్ని ప్రజలకి మరింత అర్థమయ్యేలా చెప్పడంలో మాత్రం వైసీపీ శ్రేణులు విఫలమవుతున్నాయి.

కొత్త పథకాల ప్రకటన, ప్రారంభోత్సవాలతో పాటుగా.. పార్టీ శ్రేణులు, ప్రజలతో మమేకమయ్యేలా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత పార్టీ అధినేతగా, ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి మీదనే వుంది.

బాహుబలి వేసిన బాటలో నడిచాడు 'సైరా'