ఒకప్పటి హీరోయిన్ దివ్వవాణి తెలుగుదేశం పార్టీలో ఫైర్ బ్రాండ్ అవుదామనుకుని, ఆఖరికి విషాదంగా ఎగ్జిట్ కావాల్సి వచ్చింది. అయితే ఇలా కావడం వెనుక ఏం జరిగింది అన్నది రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
మహానాడు ఆహ్వానితుల్లో తన పేరు లేకపోవడంపై దివ్యవాణి నేరుగా వెళ్లి లోకేష్ ను నిలదీసినట్లు తెలుస్తోంది. దానికి ఆయన ‘నిన్ను ఎవరైనా కుర్చీలోంచి లేపారా? వెళ్లిపొమ్మన్నారా? లేదు కదా? ఇంకేంటి సమస్య’ అని ఎదురు ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
కానీ దివ్వవాణి అంతటితో ఆగకుండా, తనకు ప్రసంగించే అవకాశం ఇవ్వలేదని మళ్లీ కంప్లయింట్ చేసినట్లు బోగట్టా. మహా మహా సీనియర్లకే అవకాశం దొరకలేదని, వీలయినంత వరకు మహానాడు జరిగిన ప్రాంతీయులకే అవకాశం ఇచ్చామని లోకేష్ నచ్చ చెప్పే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.
కానీ ఇంకా దివ్యవాణి వినకపోవడం, చికాకు ఎత్తిన లోకేష్…’నీకు ఇష్టం వుంటే వుండు..లేదంటే వెళ్లిపోవచ్చు’ అని కరాఖండీగా చెప్పేసినట్లు బోగట్టా.
దాంతో తెల్లబోయిన దివ్వవాణి బయటకు వెళ్లిపోయింది. ఎందుకు వచ్చిన రగడం అని ఆమె రాజీనామా లేఖ అనంతరం కొందరు బుజ్జగించే యత్నం చేసి లోకేష్ దగ్గరకు తీసుకెళ్దామని ప్రయత్నించారని తెలుస్తోంది.
తన వద్దుకు తీసుకు రావాల్సిన పని లేదని లోకేష్ చెప్పడం, అది దివ్యవాణికి తెలియడంతో ఇక తనకు ప్లేస్ లేదని అర్థమైన బయటకు వచ్చేసినట్లు తెలుస్తోంది.