తెలంగాణకూ జగనే సీఎం కావాలి..!

ఏపీలో గ్రామ సచివాలయాలు, గ్రామ వాలంటీర్ల ఉద్యోగాల భర్తీ తెలంగాణలో కలకలం రేపింది. ఏళ్ల తరబడి హైదరాబాద్ హాస్టల్స్ లో ఉంటూ కాంపిటీటివ్ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న ఆంధ్రా యువత అంతా సొంతూళ్లకు…

ఏపీలో గ్రామ సచివాలయాలు, గ్రామ వాలంటీర్ల ఉద్యోగాల భర్తీ తెలంగాణలో కలకలం రేపింది. ఏళ్ల తరబడి హైదరాబాద్ హాస్టల్స్ లో ఉంటూ కాంపిటీటివ్ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న ఆంధ్రా యువత అంతా సొంతూళ్లకు పయనమైంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్, నారాయణగూడ ప్రాంతాల్లో ఒక్కసారిగా హాస్టల్స్, కోచింగ్ సెంటర్లు ఖాళీ అయ్యాయి. ఒకటి రెండేళ్లుగా పరీక్షల కోసం సన్నద్ధమవుతున్న ప్రతిఒక్కరికీ పోస్టింగ్ రావడంతో హైదరాబాద్ నుంచి దాదాపు 70శాతం మంది ఏపీ యువత తమ స్వస్థలాలకు చేరుకుంది.

దీంతో సహజంగానే తెలంగాణ నిరుద్యోగ యువతలో కుతూహలం ఏర్పడింది. రోజువారీ వార్తలు చూస్తున్నప్పటికీ… నేరుగా ఇక్కడి స్నేహితులకు ఫోన్లు చేసి సమాచారం తెలుసుకుంటున్నారు. ఇన్ని పోస్టులు ఎందుకు భర్తీ చేశారు, అసలివన్నీ గవర్నమెంట్ ఉద్యోగాలేనా, జీతాలెంత అని ఎంక్వయిరీ మొదలు పెట్టారు. ఏపీ యువత చెబుతున్న సమాధానాలు విని షాకవుతున్నారు. మాక్కూడా జగన్ సీఎం అయి ఉంటే ఎంత బాగుండేదో అని కొంతమంది తెలంగాణ నిరుద్యోగులు అభిప్రాయపడుతున్నారు.

అసలు రాష్ట్రం విడిపోకుండా ఉండి, ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి జగన్ సీఎం అయి ఉంటే ఇంకెలా ఉండేదో అని అంటున్నారంటే తెలంగాణ యువత ఆవేదనను అర్థం చేసుకోవచ్చు. బంగారు తెలంగాణలో అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు అంటూ 2014 ఎన్నికల ముందు ప్రకటించిన కేసీఆర్ ఆ తర్వాత అసెంబ్లీలోనే అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కడైనా ఉంటాయా, పోనీ నేను చెబితే నమ్మేయడమేనా, దిమాక్ లేదా అంటూ రివర్స్ గేమ్ స్టార్ట్ చేశారు. దీంతో తెలంగాణ యువత నొచ్చుకున్నా చేసేదేం లేక, కేసీఆర్ కి ప్రత్యామ్నాయం లేక సైలెంట్ అయిపోయారు.

ఇప్పుడు ఏపీలో సచివాలయాల ఉద్యోగాలు, వాలంటీర్లతో సహా మొత్తం 4 లక్షల ఉద్యోగాలు భర్తీ అయ్యేసరికి తెలంగాణ యువతలో ఒకటే ఆవేదన. మేం బాగుపడతామనుకున్నాం, రాష్ట్రం విడిపోయి జగన్ సీఎం అయ్యాక మీకు మేలు జరిగిందంటూ ఏపీలోని స్నేహితుల దగ్గర వాపోతున్నారు. ఈ నాలుగు రోజుల్లో ఇలాంటి సంభాషణలు కోకొల్లలు. ఏపీలో లక్షల ఉద్యోగాలు భర్తీ చేసిన జగన్ ఇక్కడే కాదు, తెలంగాణలో కూడా చర్చనీయాంశమయ్యారు. 

బాహుబలి వేసిన బాటలో నడిచాడు 'సైరా'