హీరో నానిని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రశంసించారు. బలమైన వ్యక్తిత్వం కలవాడని, బలంగా నిల్చోగల వ్యక్తి అని అన్నారు. అంటే సుందరానికి ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో మాట్లాడుతూ నాని గురించి ఈ రెండే మాటలు మాట్లాడారు.
బలమైన వ్యక్తి, బలంగా నిల్చోవడం అని చెప్పడం వెనుక గతంలో ఆంధ్రలో టికెట్ రేట్ల విషయంలో నాని ఒక్కరే గట్టిగా మాట్లాడడాన్ని గుర్తుచేసుకోవచ్చు. చిత్ర పరిశ్రమ ఏ ఒక్కరి సొత్తు కాదు. అందరి సొత్తు అని పవన్ అన్నారు. మా ఇంట్లో కూడా నానికి అభిమానులు వున్నారన్నారు.
తనకు డ్యాన్స్ లు చేయడం ఇష్టం వుండదని, మంచి మ్యూజిక్ వెనక్కు వస్తుంటే నడవడం ఇష్టం అని, దర్శకులు తనను గన్ పాయింట్ లో పెట్టి డ్యాన్స్ లు చేయించారని, ఇకపైనైనా తనను నడవనివ్వండి అన్నారు. ఎవరినైనా ఎదిరించే ధైర్యాన్ని తనకు చిత్ర పరిశ్రమే ఇచ్చిందని పవన్ అన్నారు.
పవన్ ను యూ ట్యూబ్ వెదుక్కోవాలి
పవన్ కళ్యాణ్ అభిమానులకు దర్శకుడు హరీష్ శంకర్ చిత్రమైన విజ్ఙప్తి చేసౌరు. బయట సినిమా ఫంక్షన్ లకు పవన్ కళ్యాణ్ వచ్చినపుడు ఫ్యాన్స్ అరుపులు, కేకలు లేకుండా వుండాలని. అలా వుంటేనే మళ్లీ మళ్లీ పవన్ ఇలాంటి సమావేశాలకు వస్తారని, లేదంటే యూ ట్యూబ్ లోనే వెదుక్కోవాల్సి వుంటుందని అన్నారు.
పవన్ వచ్చినపుడు గడబిడ చేయకుండా వుండమని చెప్పడం వరకు ఓకె. కానీ పవన్ ను యూ ట్యూబ్ లోనే వెదుక్కోవాలని అనడం మాత్రం చిత్రంగా వుంది.
పవన్ సినిమాల ఒకటి నిర్మాణంలో వుంది. మరిన్ని సినిమాలు నిర్మాణంలో వున్నాయి. అందువల్ల పవన్ సినిమాల కోసం, స్పీచ్ ల కోసం యూ ట్యూబ్ లో వెదుక్కోవాల్సి రావడం ఏమిటో?.
ఇదిలా వుంటే తను పవన్ తో చేయబోయే సినిమా ఎప్పుడు మొదలైనా ఫ్యాన్స్ మెచ్చేలా వుంటుందని హరీష్ శంకర్ అన్నారు.