ఆల్ పాస్ అంటే బాగుంటుందా అయ్యన్నా…?

విద్యను కూడా రాజకీయం చేయడం విశేషంగానే చూడాలి. ఒకపుడు చదువుకునేవారు, ఇపుడు చదువుకొంటున్న రోజులు. ఈ నేపధ్యంలో కొన్ని దశాబ్దాలుగా విద్య వ్యాపారం అయిపోయింది. ఇక కరోనా కాలంలో చదువు కాస్తా అటకెక్కింది. ఇది…

విద్యను కూడా రాజకీయం చేయడం విశేషంగానే చూడాలి. ఒకపుడు చదువుకునేవారు, ఇపుడు చదువుకొంటున్న రోజులు. ఈ నేపధ్యంలో కొన్ని దశాబ్దాలుగా విద్య వ్యాపారం అయిపోయింది. ఇక కరోనా కాలంలో చదువు కాస్తా అటకెక్కింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. 

ఎనిమిది, తొమ్మిది తరగతులకు పరీక్షలు లేకుండా ముందు క్లాసులలోకి ఎత్తి పడేశారు. ఇక గత విద్యాసంవత్సరం రెండు నెలలు లేట్ గా స్టార్ట్ అయింది. ఇన్ని రకాలైన కారణాలు కళ్ళ ముందున్నా కూడా పదవ తరగతి ఫలితాలలో 67 శాతం రిజల్ట్స్ వచ్చాయి. ఒక వైపున చూస్తే ఇది గుడ్ రిజల్ట్ గా చెప్పాలి.

అయితే ఏమీ తెలియనట్లుగా అపుడే ఏపీకి వచ్చినట్లుగా కొందరు విపక్ష నేతలు విమర్శలు చేయడం పట్ల మేధావులు, విద్య పట్ల మమకారం కలిగిన వారు కూడా ఆక్షేపించే పరిస్థితి. ఫెయిల్ అయినా గ్రేస్ మార్కులు ఇచ్చసి పాస్ చేయించమంటాడు ఒక నాయకుడు. మరో నాయకుడు విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టింది అంటాడు.

నిజానికి నూటికి నూరు శాతం అంతా పాస్ అని ర్యాంకులు వచ్చాయని చెప్తే ఎవరికైనా అనుమానం రావాలి. ఏమిటీ విద్యా వ్యవస్థ అని కూడా బాధపడాలి. నిఖార్సుగా పరీక్షలు పెట్టి ఫలితాలు వెల్లడిస్తే కూడా తప్పు పడితే ఏమనాలి. అందులో కూడా రాజకీయమే టీడీపీ వారు చేస్తున్నారు అని మండిపడుతున్నారు వైసీపీ నేతలు.

ఇక ఏపీలో విద్యా వ్యవస్థ సర్వనాశనం అయిందని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అంటున్నారు. అంటే ఆల్ పాస్ అంటే అంతా ఒకేనా అయ్యన్నా అని సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. 

బాగా చదివి పాస్ అయిన వారు, మంచి మార్కులు వచ్చిన విద్యార్ధులు ఈ డిమాండ్లు విని ఏమనుకుంటారన్న ఆలోచన కూడా లేకుండా అందరినీ పాస్ చేయండి సొమ్మేమి పోయింది అంటున్న కొందరు విపక్ష నేత తీరు చూస్తేనే విద్యా వ్యవస్థకు ఇపుడు ఏమైనా జరుగుతుందేమో అన్న భయం అయితే ఉంది మరి.