అరిజోన రాష్ట్రం లో ఆటా ఫీనిక్స్ టీం ప్రారంభం

అమెరికన్ తెలుగు అసోసియేషన్ వారు నూతనంగా ఫీనిక్స్, అరిజోన, టీం ఆరంభించారు. జూన్ 5వ తారీఖున అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో దాదాపు 400 పైగా తెలుగు వారు పాల్గొన్నారు. Advertisement ఆటా ప్రెసిడెంట్ భువనేశ్…

అమెరికన్ తెలుగు అసోసియేషన్ వారు నూతనంగా ఫీనిక్స్, అరిజోన, టీం ఆరంభించారు. జూన్ 5వ తారీఖున అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో దాదాపు 400 పైగా తెలుగు వారు పాల్గొన్నారు.

ఆటా ప్రెసిడెంట్ భువనేశ్ బుజాల మరియు సెక్రటరీ హరి ప్రసాద్ రెడ్డి లింగాల ముఖ్య అతిధులుగా విచ్చేసిన ఈ కార్యక్రంలో చిన్నారులు, పెద్దలు ఎంతో ఉత్సాహంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు, పాటల పోటీలు మరియు నృత్య పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విజేతలకు బహుమతులు అందచేశారు.

అట ప్రెసిడెంట్ భువనేశ్ బుజాల మాట్లడుతూ 100 మందికి పైగా కొత్త సభ్యులు చేరటం ఎంతో సంతోషంగా వుంది అని  ఫీనిక్స్ లోకల్ టీం సేవలు కొనియాడారు. విజేతలకు బహుమతులు అందచేశారు. రఘు గాడి, రీజినల్ కోఆర్డినేటర్, శేషిరెడ్డి గాదె కో-చైర్  అట స్పోర్ట్స్, వంశీ ఏరువారం ర్.సి., చెన్నయ్య మద్దూరి ర్.సి., బిందా కిరణ్ ఈవెంట్ కోఆర్డినేటర్ కొత్తగా మెంబెర్స్ చేర్పించటంలో ఎంతో తోడ్పాటుని అందించారు.

వ్యాఖ్యాతలుగా నివేదిత గాడి, భార్గవి  మహీధర్, కిరణ్మయి జ్యోతుల & నీరజ వ్యవరించారు. ఆటా సెక్రటరీ హరి ప్రసాద్ రెడ్డి లింగాల మాట్లాడుతూ భవిష్యత్తులో ఈ టీం మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలి అని ఆకాంక్షించారు, ఆర్గనైజింగ్ టీం సభ్యులు శిల్ప పెనెత్స, రేఖ రెడ్డి ,మదన్ గోపాల్ బొల్లారెడ్డి, ఋక్కు మిల, అనుదీప్ యాపల, సుదర్శన్ మాచుపల్లి, ప్రసాద్ తాటికొండ, ప్రశాంత్ గంగవల్లి & విజయ్ కందుకూరి తదితరులుని అభినందించారు.