ఆ హీరోకు ఇంకా గెటప్స్ పిచ్చి తగ్గలేదు!

విక్రమ్.. గెటప్స్ కు పెట్టింది పేరు. విక్రమ్ నుంచి ఓ సినిమా వస్తుందంటే చాలు, అందులో కచ్చితంగా మేకోవర్స్ కనిపిస్తాయి. సరికొత్త లుక్ తో విక్రమ్ ఆకట్టుకుంటాడు. జనాలందరికీ ఇదే అభిప్రాయం ఉంది. విక్రమ్…

విక్రమ్.. గెటప్స్ కు పెట్టింది పేరు. విక్రమ్ నుంచి ఓ సినిమా వస్తుందంటే చాలు, అందులో కచ్చితంగా మేకోవర్స్ కనిపిస్తాయి. సరికొత్త లుక్ తో విక్రమ్ ఆకట్టుకుంటాడు. జనాలందరికీ ఇదే అభిప్రాయం ఉంది. విక్రమ్ కూడా ఈ మాయలో పడిపోయాడు. గెటప్స్ బాగుంటే సినిమా ఒప్పుకోవడం స్టార్ట్ చేశాడు. ఫలితంగా కంటెంట్ లేకపోవడంతో విక్రమ్ నటించిన చాలా సినిమాలు గాల్లో కలిసిపోయాయి.

వరుస ఫ్లాపులతోనైనా విక్రమ్ తను చేస్తున్న తప్పుల్ని తెలుసుకుంటాడని అంతా భావించారు. కానీ ఈ హీరో మారలేదు. మరోసారి గెటప్స్ పై మనసు పారేసుకున్నాడు. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో ఏకంగా 25 గెటప్స్ లో కనిపించబోతున్నాడు ఈ హీరో. రేపట్నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతోంది. మొదటి షెడ్యూల్ లోనే డిఫరెంట్ గెటప్ తో షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు.

రీసెంట్ గా విక్రమ్ నటించిన సినిమాలన్నీ ఫ్లాప్ అవుతూ వస్తున్నాయి. అందులో విక్రమ్ గెటప్స్ బాగుంటున్నాయి. రకరకాల జానర్స్ కూడా ట్రై చేశాడు. కానీ ఫ్లాపుల పరంపర మాత్రం ఆగలేదు. దీనికి కారణం అతడి సినిమాల్లో కంటెంట్ పేలవంగా ఉండడమే. ఈ దిశగా విక్రమ్ మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తాడని ప్రేక్షకులు భావించారు. కానీ విక్రమ్ మరోసారి గెటప్స్ వైపే మొగ్గుచూపాడు.

గెటప్స్ తో పాటు కంటెంట్ కూడా బాగుంటే సినిమా ఆటోమేటిగ్గా హిట్ అవుతుంది. కేవలం గెటప్స్ పైనే దృష్టిపెడితే మొదటికే మోసం వస్తుంది. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో చేయబోతున్న ఈ సినిమాతో కొత్త రికార్డుపై కన్నేశాడట విక్రమ్.

ఒకే సినిమాలో 25 గెటప్స్ వేసిన హీరో వరల్డ్ సినిమాలో ఇప్పటివరకు ఎవరూ లేరట. ఆ రికార్డును సొంతం చేసుకోవడానికి విక్రమ్ ప్రయత్నిస్తున్నట్టున్నాడు. సినిమా సక్సెస్ సంగతి తర్వాత. 

బాహుబలి వేసిన బాటలో నడిచాడు 'సైరా'