ఆహా పెట్టుబఢి టార్గెట్ 1500 కోట్లు?

ఓన్లీ తెలుగు ఓటిటిగా ఓ ప్రత్యేకతను జోడించుకుని ప్రారంభమైంది ఆహా. నిర్మాత అల్లు అరవింద్, టాప్ రియల్ ఎస్టేట్ టైకూన్ మై హోమ్ రామేశ్వరరావు మేజర్ పార్టనర్ లుగా, నిర్మాత దిల్ రాజు మైనర్…

ఓన్లీ తెలుగు ఓటిటిగా ఓ ప్రత్యేకతను జోడించుకుని ప్రారంభమైంది ఆహా. నిర్మాత అల్లు అరవింద్, టాప్ రియల్ ఎస్టేట్ టైకూన్ మై హోమ్ రామేశ్వరరావు మేజర్ పార్టనర్ లుగా, నిర్మాత దిల్ రాజు మైనర్ పార్టనర్ గా వున్నారని ఇండస్ట్రీ వర్గాల బోగట్టా. సరిగ్గా లాక్ డౌన్ టైమ్ లో ఆహా రావడంతో, చకచకా జనాల్లోకి వెళ్లడానికి మార్గం సుగమం అయింది. ఇప్పటికి తొమ్మిది లక్షల  వరకు సబ్ స్క్రయిబర్లు వచ్చారని తెలుస్తోంది.

కానీ ఇప్పటికి పెట్టుబడే 200 కోట్ల వరకు అయిందని టాక్. ఓటిటి అన్నది భూతం లాంటిదని, దాని ఆకలి ఇంతా అంతా కాదని, ఇలా పెడుతూనే వుండాలని అల్లు అరవింద్ సన్నిహిత వర్గాలు అంటున్నాయి. ఈ సంగతి ఆహా గురించి ఆలోచన చేసినపుడే తెలుసు అని, వెయ్యి నుంచి పదిహేను వందల కోట్లు పెట్టుబఢికి సిద్దపడే రంగంలోకి దిగారని చెబుతున్నారు.

యాభై లక్షల సబ్ స్క్రయిబర్లు ఆహా లక్ష్యమని, అప్పుడే బ్రేక్ ఈవెన్ పాయింట్ కు చేరుకుంటుందని ఆ వర్గాలు అభిప్రాయపడ్డాయి. ప్రస్తుతానికి ఆహా మరీ పెద్ద సినిమాలు కొనడం మీద దృష్టి పెట్టడం లేదు. సబ్ స్క్రయిబర్లకు నెల నెలా ఒకటి రెండు సినిమాలు అందిస్తూనే, ఒరిజినల్ కంటెంట్ మీద దృష్టి పెడుతోంది. టాప్ డైరక్టర్ లు అందరికీ ఆహా యాజమాన్యం స్వయంగా ఫోన్ లు చేసి, మంచి ప్రొడక్ట్ ఒకటి అందించమని కోరుతోంది. టాప్ లైన్ డైరక్టర్లు అందరూ ఇలా ఫోన్ లు అందుకున్నవారే. వారంతా దీని మీద ఆలోచనలు చేస్తున్నారు కూడా. 

జగన్ దేశంలోనే గొప్ప నాయకుడవుతాడు