హుజూర్ నగర్ బరిలో.. మిగిలింది ఎంతమందంటే!

తెలంగాణలో ఆసక్తి రేపుతున్న హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో 31 మంది మిగిలినట్టుగా తెలుస్తోంది. ప్రధాన పార్టీల మధ్యన ప్రతిష్టాత్మక పోరుగా మిగిలిన ఈ పోటీలోకి చాలామంది వచ్చారు. ఏకంగా 76…

తెలంగాణలో ఆసక్తి రేపుతున్న హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో 31 మంది మిగిలినట్టుగా తెలుస్తోంది. ప్రధాన పార్టీల మధ్యన ప్రతిష్టాత్మక పోరుగా మిగిలిన ఈ పోటీలోకి చాలామంది వచ్చారు. ఏకంగా 76 మంది నామినేషన్లు దాఖలు చేయడం గమనార్హం. ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్లగొండ ఎంపీగా నెగ్గడంతో, ఆయన హుజూర్ నగర్ ఎమ్మెల్యే సీటుకు రాజీనామా చేయడంతో ఈ ఉపఎన్నిక వచ్చిన సంగతి తెలిసిందే.

ఉప ఎన్నికలో పోటీకి చాలామంది ఉత్సాహాన్ని చూపారు. 76 మంది నామినేషన్లు దాఖలు చేశారు. వారిలో 45 మంది నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. అవన్నీ తిరస్కరణకు గురైనా ఇంకా  31 మంది పోటీలో నిలబడటం గమనార్హం. ఎంతమంది పోటీలో ఉన్నా ప్రధాన పోటీ రెండు పార్టీల మధ్యనే అని స్పష్టం అవుతోంది. కాంగ్రెస్, టీఆర్ఎస్ ల మధ్యన ప్రధాన పోటీ జరగనుంది.

భారతీయ జనతా పార్టీ సత్తా ఏమిటో కూడా ఇప్పుడు తేటతెల్లం అవుతుంది. ఇక తెలుగుదేశం పార్టీ కూడా మళ్లీ ఇక్కడ పోటీకి దిగింది. ఒకవేళ టీఆర్ఎస్ వ్యతిరేక ఓటును టీడీపీ కొద్దోగొప్పో చీల్చినా.. అది కాంగ్రెస్ కు నష్టమే చేయవచ్చు. కాంగ్రెస్ నుంచి పద్మావతి, టీఆర్ఎస్ నుంచి సైదిరెడ్డి, బీజేపీ నుంచి రామారావు, తెలుగుదేశం పార్టీ నుంచి కిరణ్మయిలు పోటీలో ఉన్నారు.

 'చిరు పనైపోయినట్టే' అని నవ్విన నోళ్లు మూతబడేలా