గాంధీ జయంతి సెలవు దినాన్ని క్యాష్ చేసుకోవడానికి సినిమాలు పోటీపడ్డాయి. రెండు భారీ సినిమాలు ఈ రోజున విడుదల అయ్యాయి. ఒకటి బహుభాషా సినిమా. అదే సైరా. తెలుగుతో పాటు సైరా తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో కూడా విడుదల అయ్యింది. ఇలా ఐదు భాషల్లో విడుదలై తొలి రోజున భారీ వసూళ్లను సంపాదించుకునే స్కీమ్ లో ఈ సినిమా విడుదల అయ్యింది.
ఈ సినిమాకు రివ్యూలు, రేటింగుల విషయంలో తెలుగు మీడియాను మినహాయిస్తే.. బాలీవుడ్-హిందీ మీడియా కూడా వెల్కమ్ చెప్పింది. ఈ సినిమాకు అవి పాజిటివ్ రివ్యూలను, పాజిటివ్ రేటింగులను ఇచ్చాయి. ఇంగ్లిష్ వార్తా సంస్థల్లోని బాలీవుడ్ సినీ విశ్లేషకులు 'సైరా.. నరసింహారెడ్డి'ని పలు విషయాల్లో ప్రశంసించారు. మంచి రేటింగులు ఇచ్చి, పాజిటివ్ రివ్యూలను ఇచ్చారు.
ఇదే సమయంలో బాలీవుడ్ లో 'సైరా'కు గట్టిపోటీ అయిన 'వార్' అంత పాజిటివ్ రేటింగులను పొందకపోవడం గమనార్హం. ఈ సినిమా హిందీలో భారీఎత్తున విడుదల అయ్యింది. సౌత్ లోని నగరాల్లో కూడా ఈ సినిమాను భారీ సంఖ్యలోని థియేటర్లలో విడుదల చేశారు.
యంగ్ జనరేషన్ లో మంచి ఇమేజ్ కలిగి ఉన్న టైగర్ ష్రాఫ్ , ఇదివరకూ వెలిగిన హృతిక్ రోషన్లు కలిసి నటించిన ఈ యాక్షన్ సినిమాకు యావరేజ్ రేటింగులే వచ్చాయి. ఇది యాక్షన్ థ్రిల్లరే అని, అనేట ట్విస్టులు ఆశ్చర్యపరుస్తాయని రివ్యూయర్లు పేర్కొన్నారు. ధూమ్, రేస్ సీరిస్ ల సినిమా వలె ఉందంటూ ఈ సినిమాకు సగంసగం రేటింగులను ఇచ్చారు బాలీవుడ్ ఎనలిస్టులు.