రజనీకాంత్ రాజకీయం వాయిదాల పద్ధతిలోనే సాగుతున్న సంగతి కొత్తది ఏమీకాదు. అదిగో వస్తున్నాడు.. ఇదిగో వస్తున్నాడని.. ఇరవైయేళ్ల కిందట మొదలైంది పాట. జయలలిత మరణానంతరం ఏర్పడిన శూన్యత నేపథ్యంలో మాత్రం రజనీకాంతే స్వయంగా స్పందించారు. 'ఇదిగో వచ్చేయడమే..' అన్నట్టుగా ఆయన హడావుడి మొదలుపెట్టారు. అయితే ఎన్నికలు వస్తున్నాయి, పోతున్నాయి కానీ.. రజనీకాంత్ మాత్రం ముందుకు రావడంలేదు.
బహుశా ఇక రజనీకాంత్ రాజకీయానికి ఆఖరి గడువు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలే అని పరిశీలకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. మరో రెండేళ్లలోపే జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రజనీకాంత్ పార్టీ పోటీ చేయకపోతే.. ఆపై అవకాశాలు లేవని విశ్లేషకులు అంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో అడపాదడపా రజనీకాంత్ పొలిటికల్ స్టేట్ మెంట్లు ఇస్తున్నారు. ఈ పరిణామాల్లో.. రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై కొత్త కబురు వినిపిస్తోంది.
అదేమిటంటే.. వచ్చే పొంగల్ తర్వాత రజనీకాంత్ పొలిటికల్ యాక్టివిటీస్ ఊపందుకుంటాయట. పొంగల్ తర్వాత రాజకీయాన్ని వేడెక్కిరస్తారట రజనీకాంత్. మరి ఆయన చేతిలోనేమో సినిమాలున్నాయి. దీంతో.. పొంగల్ తర్వాత అయినా ఏ మేరకు పాలిటిక్స్ చేస్తారో ఈ స్టార్ హీరో!