పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమింగ్ బ్యాక్ ఫిల్మ్ వకీల్ సాబ్ మరో కొన్ని నెలలు వెనక్కు జరిగినట్లే. – ఈ ఏడాది సమ్మర్ కు రావాల్సిన సినిమా కరోనా కారణంగా దసరాకు అనుకున్నారు. కానీ అక్కడి నుంచి సంక్రాంతికే అని వినిపించింది. కానీ లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే 2021 సమ్మర్ కే అన్నది.
వాక్సీన్ రాకుండా షూటింగ్ లు కష్టం అని పవర్ స్టార్ నే స్వయంగా చెప్పేసారు. వాక్సీన్ లు రావాలి. అది కూడా అందరికీ అందుబాటులోకి రావాలి. ఇవన్నీ కలిసి 2020 దాటేసేలా వుంది వ్యవహారం. అందువల్ల పెద్ద సినిమాలకు ఈసారి సంక్రాంతి అంత అనువైన డేట్ కాదు అని వినిపిస్తోంది.
2021 సమ్మర్ అయితే అన్ని విధాలా పరిస్థితి నార్మల్ అవుతుందని, అందువల్ల టాలీవుడ్ పెద్ద సినిమాలు ఏవయినా కూడా 2021 సమ్మర్ కే రెడీ అవుతాయని తెలుస్తోంది. ఇధిలా వుంటే నితిన్, అఖిల్, నాని, శర్వానంద్ ల సినిమాలు మాత్రం సంక్రాంతి విడుదల టార్గెట్ గా పెట్టుకున్నాయి. ఎప్పుడో రెడీ అయిపోయి కూర్చున్న ఉప్పెన కూడా సంక్రాంతికే అని వినిపిస్తోంది.
నాగ్ చైతన్య-సాయిపల్లవి-ఆసియన్ సునీల్ ల లవ్ స్టోరీ 2020 క్రిస్మస్ కు విడుదల చేసే ఆలోచనలో వున్నారు.