కరోనా ఎవ్వర్నీ వదలడం లేదు. చిన్నాపెద్దా, పేద-ధనిక అనే తేడాలేకుండా అందర్నీ కబళించేస్తోంది. బిగ్ బి నుంచి బడుగు జీవి వరకు అందరూ కరోనా బాధితులే. ఇప్పుడీ లిస్ట్ లోకి హీరో విశాల్ కూడా చేరిపోయాడు. అవును.. తనకు కరోనా వచ్చిన విషయాన్ని హీరో విశాల్ స్వయంగా ధృవీకరించాడు.
“అవును నిజమే.. నాన్నకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఆయనకు సహాయం చేయడం వల్ల నాకు కూడా ఆ లక్షణాలు వచ్చాయి. హై-ఫీవర్, జబులు, దగ్గుతో బాధపడ్డాను. నా మేనేజర్ కు కూడా అవే లక్షణాలు బయటపడ్డాయి.”
అయితే తామంతా ఇప్పుడు కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నామని ప్రకటించాడు విశాల్. తామంతా ఆయుర్వేదిక మెడిసిన్ వాడి వారం రోజుల్లోనే కరోనా నుంచి బయటపడ్డామని తెలిపాడు. ప్రస్తుతం తను, తన తండ్రి, మేనేజర్ అందరం ఆరోగ్యంగా ఉన్నామని ప్రకటించాడు ఈ హీరో.
విశాల్ కు కరోనా సోకిందనే విషయం తెలిసి కోలీవుడ్ షాక్ అయింది. ఈమధ్య కాలంలో అతడితో కాంటాక్ట్ లోకి వెళ్లిన వాళ్లంతా క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. అయితే ఆయుర్వేదిక మందులతో తనకు కరోనా తగ్గిపోయిందని విశాల్ ప్రకటించడం ఇప్పుడు మరో కొత్త చర్చకు దారితీసింది.