స్మాల్ స్క్రీన్ పై స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న నవ్య స్వామి కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందనే విషయాన్ని గతంలో నవ్య స్వయంగా వెల్లడించింది. అలా ప్రకటించిన వెంటనే సెల్ఫ్ క్వారంటైన్ లో ఉంటూ చికిత్స తీసుకుంటున్న ఈ ముద్దుగుమ్మ, ఇప్పుడు మరోసారి వీడియో రిలీజ్ చేసింది.
తనకు కరోనా పూర్తిగా తగ్గిపోయిందని ప్రకటించింది నవ్య. తన క్వారంటైన్ లైఫ్ పూర్తయిందని, ఇంతకుముందు కంటే చాలా బాగున్నానని తెలిపింది. అందరూ ఇచ్చిన ధైర్యంతో త్వరగా కోలుకున్నానని వెల్లడించింది. దాదాపు 3 వారాల పాటు ఇంట్లోనే ట్రీట్ మెంట్ తీసుకొని కరోనాను జయించింది నవ్య.
కరోనా నుంచి కోలుకున్న నవ్య తన అనుభవాల్ని వివరించింది. కరోనా ప్రాణాంతకం కాదంటున్న ఈ ముద్దుగుమ్మ.. ఎక్కువగా మందులు కూడా తీసుకోవాల్సిన అవసరం లేదంటోంది. వైద్యులు చెప్పిన సూచనలు, సలహాలు పాటిస్తూ.. మంచి ఆహారం తీసుకుంటూ తక్కువ మోతాదులో మెడిసిన్ తీసుకుంటే సరిపోతుందని చెబుతోంది. మరీ ముఖ్యంగా కరోనా వచ్చిన తర్వాత కిందామీద పడే బదులు, రాకుండా ముందుజాగ్రత్తలు తీసుకోవడమే మంచిదంటోంది.
నవ్య కోలుకోవడంతో ఆమె నటిస్తున్న సీరియల్స్ షూటింగ్స్ మళ్లీ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. అయితే తిరిగి సెట్స్ పైకి వెళ్లే విషయంపై నవ్య ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.