బాక్సాఫీస్ బరిలో ‘కుస్తీ’ పాట్లు

కొన్ని సినిమాలకు రిలీజైన మొదటి రోజు మంచి టాక్ వస్తుంది. కానీ స్టార్ ఎట్రాక్షన్ లేక బాక్సాఫీస్ పై పట్టు సాధించలేకపోతాయి. ఈమధ్య వచ్చిన ఊర్వశివో రాక్షసివో సినిమా దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా…

కొన్ని సినిమాలకు రిలీజైన మొదటి రోజు మంచి టాక్ వస్తుంది. కానీ స్టార్ ఎట్రాక్షన్ లేక బాక్సాఫీస్ పై పట్టు సాధించలేకపోతాయి. ఈమధ్య వచ్చిన ఊర్వశివో రాక్షసివో సినిమా దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా నిలవగా, ఇదే కోవలో తాజాగా మట్టి కుస్తీ సినిమా కూడా వచ్చి చేరింది.

విష్ణు విశాల్ హీరోగా నటించిన ఈ సినిమాకు రిలీజ్ రోజు టాక్ బాగుంది. స్పోర్ట్స్ డ్రామా అని భ్రమపడి థియేటర్లకు వెళ్లిన వాళ్లు ఖంగుతిన్నారు తప్పితే, మిగతా జనమంతా సినిమా బాగుందన్నారు. కానీ ఆ మౌత్ టాక్ మట్టికుస్తీని కాపాడలేకపోయింది. సినిమాకు ఆక్యుపెన్సీ చాలా తక్కువగా ఉంది.

మరోవైపు హిట్-2 సినిమా భారీ విజయాన్నందుకోవడం కూడా మట్టి కుస్తీకి ఇబ్బందికరంగా మారింది. ఈ వీకెండ్ హిట్-2కు వెళ్దామా లేక మట్టి కుస్తీ చూద్దామా అని ప్రేక్షకులు తమనుతాము ప్రశ్నించుకుంటే హిట్-2కే ఎక్కువ మార్కులు పడతాయి. ఎందుకంటే, అందులో అడవి శేష్ హీరో. మట్టికుస్తీలో విష్ణువిశాల్ హీరో.

హిట్-2కు తోడు లవ్ టుడే, మసూద సినిమాలు కూడా మార్కెట్లో నిలబడ్డాయి. ఇప్పటికీ కుర్రాళ్లు లవ్ టుడే చూస్తున్నారు. హారర్ జానర్ ఇష్టపడేవాళ్లు మసూదకు వెళ్తున్నారు. ఇలా 3 సినిమాల నుంచి పోటీ ఉండడంతో మట్టికుస్తీ, బాక్సాఫీస్ బరిలో నిలబడ్డానికి కుస్తీ పడుతోంది.