కెరీర్ ప్లానింగ్ లో సమంత బిజీ

అయిపోయింది. ఓ బంధం తెగిపోయింది. అలా అని ప్రయాణం అక్కడితో ఆగిపోదుగా. అసలే కెరీర్ కోసమే ఈ బంధాన్ని పణంగా పెట్టేసుకుంది సమంత అని టాక్ కూడా వుంది. బాలీవుడ్ లో, పాన్ ఇండియా…

అయిపోయింది. ఓ బంధం తెగిపోయింది. అలా అని ప్రయాణం అక్కడితో ఆగిపోదుగా. అసలే కెరీర్ కోసమే ఈ బంధాన్ని పణంగా పెట్టేసుకుంది సమంత అని టాక్ కూడా వుంది. బాలీవుడ్ లో, పాన్ ఇండియా సిన్మాల్లో మంచి పాత్రలు వేసి, మంచి నటిగా ప్రూవ్ చేసుకోవాలనే తాపత్రయం గట్టిగా వుంది ఆమెకు.

అందుకే ఇప్పటి నుంచే ఆ దిశగా చకచకా అడుగులు వేస్తోందని బోగట్టా. తనకు బాగా స్నేహం వున్న, తనంటే అభిమానం వున్నదర్శకులతో టచ్ లో వున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికిప్పుడు ప్రాజెక్టులు ఫైనల్ కావడం అన్నది కష్టం. ముఖ్యంగా టాలీవుడ్ లో. 

అందుకే బాలీవుడ్, తమిళ రంగాల వైపు సమంత దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. మరోపక్క సమంతకు వ్యతిరేకంగా, అలాగే చైతన్యకు వ్యతిరేకంగా వార్తలు ఏవో ఒకటి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చైతన్యను తప్పు పట్టడం అన్నది కాస్త ఎక్కువగానే కనిపిస్తోంది. 

సమంతతో వివాహానికి ముందు నుంచే సన్నిహిత సంబంధాలు వున్నాయి చైతన్యకు. అంతే కాదు మరో హీరోయిన్ తో కూడా చైతూకు మంచి స్నేహబంధాలు వుండేవని అప్పట్లో తెగ గ్యాసిప్ లు వినిపించేవి. ఇప్పుడు అలాంటి అన్నీ సోషల్ మీడియాలో అక్కడా అక్కడా గుర్తు చేస్తున్నారు. కొత్తగా మరి కొన్ని బంధాలు అంట కడుతున్నారు.  

మరో పక్కన సమంతకు వున్న కొందరు ఆడస్నేహితుల రాడికల్ భావాల ఫలితమే ఈ పరిస్థితి అని టాక్ వినిపిస్తోంది. వారే ఆమెను తప్పుదారి పట్టించారనే టాక్ వినిపిస్తోంది.