చాణక్య శాటిలైట్, డిజిటల్ @ 6 కోట్లు

గోపీచంద్ హీరోగా విడుదలకు రెడీ అవుతున్న సినిమా చాణక్య. ఈ సినిమా నెల తొలివారంలో విడుదల కాబోతోంది. ఈ సినిమా నాన్ థియేటర్ మార్కెటింగ్ వ్యవహారాలు ఇప్పుడు పూర్తయ్యాయి. శాటిలైట్ హక్కులను మాటీవీ తీసుకుంది.…

గోపీచంద్ హీరోగా విడుదలకు రెడీ అవుతున్న సినిమా చాణక్య. ఈ సినిమా నెల తొలివారంలో విడుదల కాబోతోంది. ఈ సినిమా నాన్ థియేటర్ మార్కెటింగ్ వ్యవహారాలు ఇప్పుడు పూర్తయ్యాయి. శాటిలైట్ హక్కులను మాటీవీ తీసుకుంది. డిజిటల్ హక్కులు అమెజాన్ కు ఇచ్చారు.

గోపీచంద్ సినిమా అమెజాన్ లోకి రావడం ఇదే తొలిసారి. శాటిలైట్, డిజిటల్ హక్కుల రూపంలో ఆరుకోట్ల ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలావుంటే సినిమా హిందీ డబ్బింగ్ రైట్ల రూపంలో మరో 9 కోట్ల ఆదాయం వచ్చింది. ఫుల్ యాక్షన్ సినిమా కావడంతో హిందీ డబ్బింగ్ రేటు కూడా బాగానే పలికింది.

మొత్తంమీద చాణక్య నాన్ థియేటర్ హక్కుల రూపంలో 15 కోట్లు వచ్చాయి. తిరు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో గోపీచంద్ సరసన మెహరీన్ నటించింది. ఏకె ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర నిర్మించారు.

సౌత్ స్టార్ హీరోలు.. బాలీవుడ్ లో లాంగ్వేజ్  ప్రాబ్లమ్!