చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్నది ఓ స్టాండర్ట్ పొలిటికల్ డైలాగు. ఇంచుమించు ఇలాంటి స్టేట్ మెంట్ నే హీరో రామ్ చరణ్ సుమారు ఏడేళ్ల క్రితం ట్వీట్ చేసారు.
''..”Finally, the govt has proved its capability!”…'
మామూలుగా అయితే ముందు వెనుక ఎవ్వరి ప్రస్తావన, ఎవ్వరి పేరు లేని ఈ లైన్ కు అంతగా ప్రాధాన్యత వుండేదికాదు. పైగా సాదాసీదా పర్సన్ ఇలా ఓ స్టేట్ మెంట్ పడేసినా ప్రాధాన్యత వుండదు. కానీ స్టేట్ మెంట్ వచ్చింది మెగా హీరో రామ్ చరణ్ నుంచి. అప్పటికి ఆయన తండ్రి మెగాస్టార్ చిరంజీవి మంత్రిగా వున్నారు. పైగా స్టేట్ మెంట్ రావడానికి కొద్ది సమయం ముందే వైకాపా నేత వైఎస్ జగన్ అరెస్ట్ అయ్యారు.
అదీ విషయం..
ఏళ్లు గడిచాయి. వైఎస్ జగన్ అద్భుతమైన మెజారిటీ ఆంధ్ర ముఖ్యమంత్రి అయ్యారు.
మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలు వదిలేసారు.
రామ్ చరణ్ ట్విట్టర్ లో లేరు.
అదే ఫ్యామిలీకి చెందిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్వంతంగా పార్టీ పెట్టి నిత్యం అదే వైఎస్ జగన్ పై విమర్శలు కురిపిస్తున్నారు.
అదే జగన్ ఇప్పుడు అదే రామ్ చరణ్ సినిమాకు అదనపు ఆటల అనుమతి ఇవ్వాల్సిన స్టేజ్ లో వున్నారు.
ఈ క్షణం వరకు ఇంకా అనుమతి రాలేదు. వస్తుందనే ఆశతోనే వుంది రామ్ చరణ్ కు చెందిన కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ.