చ‌లాన్ విధించార‌ని…పిలిచి స‌న్మానం

తెలంగాణ ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల‌శాఖ మంత్రి కేటీఆర్ ప్ర‌శంస‌నీయ‌మైన ప‌ని చేశారు. త‌నకు అధికారం ఉంది క‌దా అని పెత్త‌నం చేయాల‌ని ఆయ‌న భావించ‌లేదు. హోదాల‌ను అనుస‌రించి కాకుండా, నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా విధులు నిర్వ‌ర్తించిన ట్రాఫిక్…

తెలంగాణ ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల‌శాఖ మంత్రి కేటీఆర్ ప్ర‌శంస‌నీయ‌మైన ప‌ని చేశారు. త‌నకు అధికారం ఉంది క‌దా అని పెత్త‌నం చేయాల‌ని ఆయ‌న భావించ‌లేదు. హోదాల‌ను అనుస‌రించి కాకుండా, నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా విధులు నిర్వ‌ర్తించిన ట్రాఫిక్ ఎస్ఐ ఐల‌య్య‌ను కేటీఆర్ అభినందించారు.

రెండు రోజుల క్రితం లంగర్‌హౌస్‌ సంగం సమీపంలో బాపూఘాట్‌లో నిర్వహించిన మహాత్మా గాంధీ జయంతి కార్యక్రమం సందర్భంగా రాంగ్ రూట్‌లో మంత్రి వాహ‌నం వెళ్లింది. 

రాంగ్‌రూట్‌లో వెళ్లిన‌ తన వాహనానికి నిబంధనల ప్రకారం చలాన్ విధించిన ఎస్ఐ ఐలయ్య, కానిస్టేబుల్ వెంకటేశ్వర్లును మంత్రి కేటీఆర్ ఇవాళ త‌న కార్యాల‌యానికి పిలిపించుకున్నారు. వాళ్లిద్ద‌రికి శాలువాలు క‌ప్పి స‌త్క‌రించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ సామాన్య ప్రజలు, అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులకు ఒకే రకమైన నిబంధనలు వర్తిస్తాయ‌ని స్పష్టం చేశారు. ట్రాఫిక్ రూల్స్ పాటించడంలో తానెప్పుడూ ముందుంటానన్నారు.  

చలాన్ విధించిన రోజు తాను వాహనంలో లేనని కేటీఆర్‌ స్పష్టం చేశారు. విధి నిర్వహణలో నిజాయితీగా ప‌నిచేసే ఐలయ్య లాంటి అధికారులకు తాము అండగా ఉంటామని చెప్పారు.