జబర్దస్త్ లో కీలక మార్పులు

ఈటీవీ, మల్లెమాల స్టూడియోస్ కీ బంగారు బాతుగుడ్డు లాంటింది జబర్దస్త్ కార్యక్రమం. చిరకాలంగా ఈ కార్యక్రమం కాసులు కురిపిస్తోంది. అయితే ఇప్పుడు సమస్యలు తలెత్తుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా జబర్దస్త్ కు కీలకమైన క్రియేటివ్ హెడ్స్…

ఈటీవీ, మల్లెమాల స్టూడియోస్ కీ బంగారు బాతుగుడ్డు లాంటింది జబర్దస్త్ కార్యక్రమం. చిరకాలంగా ఈ కార్యక్రమం కాసులు కురిపిస్తోంది. అయితే ఇప్పుడు సమస్యలు తలెత్తుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా జబర్దస్త్ కు కీలకమైన క్రియేటివ్ హెడ్స్ నితిన్-భరత్ ఆ కార్యక్రమం నుంచి తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరో కార్యక్రమం పోరా పోవే కొనసాగింపు విషయంలో మల్లెమాల యూనిట్ తో వచ్చిన క్రియేటివ్ డిఫరెన్స్ ల కారణంగా వారిద్దరు ఈ కార్యక్రమం నుంచి తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మరోపక్క స్కిట్ లు రొటీన్ అవుతున్నాయని, అందులో చేస్తున్న కొందరు యాక్టర్లు షేప్ అవుట్ అవుతున్నారని, వీటన్నింటిని సరిచేయాలని ప్రోగ్రామ్ లో కీలకంగా వున్న నాగబాబు డిసైడ్ అయినట్లు బోగట్టా. ముఖ్యంగా బాగా లావుగా వున్న ఇద్దరు ముగ్గురు నటులకు అర్జెంట్ వెయిట్ లాస్ కావాలని, అలా అయితే యాభై వేలు గిఫ్ట్ ఇస్తానని నాగబాబు ఆపర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

స్కిట్ లు, వాటి క్వాలిటీ, నటుల ఫిజిక్ ఇవన్నీ కూడా ఇప్పుడు బేరీజు వేస్తూ, జబర్దస్త్ స్థాయిని పెంచే దిశగా నాగబాబు ప్రయత్నిస్తున్నారట. కానీ అదే టైమ్ లో కీలకమైన క్రియేటివ్ హెడ్స్ ఒక్కసారిగా తప్పుకోవడం కాస్త సెట్ బ్యాక్ అని వినిపిస్తోంది.

సౌత్ స్టార్ హీరోలు.. బాలీవుడ్ లో లాంగ్వేజ్  ప్రాబ్లమ్!