సినిమాలు అంటే అవేనా…గిల్డ్?

పుష్ప..ఆచార్య..భీమ్లా నాయక్..రాధేశ్యామ్…సర్కారువారి పాట…ఇలా అరడజను వరకు పెద్ద సినిమాలు రెడీ అవుతున్నాయి. వీటికి తేదీలు డిసైడ్ కావడం మీదే యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ కీలకంగా వుంది. వీటికే తేదీలు కేటాయించాలని డిస్కషన్లు సాగిస్తోంది.  Advertisement…

పుష్ప..ఆచార్య..భీమ్లా నాయక్..రాధేశ్యామ్…సర్కారువారి పాట…ఇలా అరడజను వరకు పెద్ద సినిమాలు రెడీ అవుతున్నాయి. వీటికి తేదీలు డిసైడ్ కావడం మీదే యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ కీలకంగా వుంది. వీటికే తేదీలు కేటాయించాలని డిస్కషన్లు సాగిస్తోంది. 

పండగలు, సమ్మర్ ఇలాంటి కీలక డెట్ లు ఈ పెద్ద సినిమాలకే అంటున్నారు గిల్డ్ పెద్దలు. మరి మీడియం సినిమాల మాటేమిటి అని ప్రశ్నిస్తున్నారు నిర్మాతలు. అసలు నిర్మాతలు కుదేలయిపోవాలన్నా, డబ్బులు రావాలన్నా ఈ మీడియం సినిమాలే. 

పెద్ద సినిమాలకు సమస్య తక్కువ. అడకుండా ఓపెనింగ్ వస్తుంది. అమ్మకాలు జరుగుతాయి. కానీ మీడియం సినిమాలకు అలా కాదు. నలభై నుంచి యాభై కోట్ల ఖర్చు వుంటుంది. విడుదల నాటికి రికవరీ కష్టం అవుతుంది. థియేటర్ మీద కొంత భారం వుండిపోతుంది. 

అందువల్ల ఇలాంటి సినిమాలకు సరైన డేట్ లు ఇవ్వాల్సి వుంది. పండగలు, సమ్మర్ కాకుండా ఏదో డేట్ కు సర్దుకోండి అంటే కష్టం అయిపోతుంది. టాలీవుడ్ లో అలాంటి సినిమాలు చాలానే రెడీ అవుతున్నాయి. 

నాని సినిమాలే రెండు మూడు వున్నాయి. శర్వానంద్ సినిమాలు వున్నాయి. వైష్ణవ్ తేజ్ సినిమా వుంది. నితిన్ సినిమా ప్రారంభం అయింది.

ఇవి కాక 15 నుంచి 20 కోట్ల సినిమాలు చాలా వున్నాయి. వీటికీ సరైన డేట్ లు లేకపోతే పరిస్థితి ఏమిటి? గిల్డ్ అన్నది కేవలం పెద్ద సినిమాలకే కాదు. మీడియం సినిమాల సంగతి కూడా చూడాలని గిల్డ్ సభ్యులే ఆవేదన చెందుతున్నారు.