నాగచైతన్యతో విడిపోయినట్టు ప్రకటించిన తర్వాత స్టార్ హీరోయిన్ సమంత ఇన్స్టా స్టోరీలో ఫస్ట్ పోస్టు షేర్ చేసింది. అందులో విడాకుల తర్వాత జీవితాన్ని కొత్తగా ప్రారంభించాలన్న కోణంలో రాసుకొచ్చింది.
ఇంకా కొన్ని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారామె. ఆ పోస్టులో అర్థం చేసుకున్న వాళ్లకు చేసుకున్నంత అన్నట్టుగా…సమంత తన అంతరంగానికి అక్షర రూపం ఇచ్చారు. ఈ పోస్టులో తన అంతరంగాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ పోస్టు ఏంటో చూద్దాం.
‘ఈ ప్రపంచాన్ని మార్చాలనుకుంటే నన్ను నేను మార్చుకోవాలి. నా పడకగదిని నేను సిద్ధం చేసుకోవాలి. ఇంటిని పరిశుభ్రం చేసుకోవాలి. మధ్యాహ్నం వరకూ నిద్రపోకూడదు. ఇక, పగటి కలలు కనడం మానేసి.. చేయాల్సిన పనులపైనే దృష్టి పెట్టాలి’ అని ఆమె ఇన్స్టా స్టోరీలో షేర్ చేశారు.
ఇక మీదట తనను తాను మార్చుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమంత స్పష్టం చేశారు. అలాగే ఇంతకాలం తాను పగటి కలలు కన్నట్టు ఈ పోస్టు ద్వారా ఆమె వెల్లడించారు.
ఇక మీదట పగటి కలలు కనడం మానేస్తానని హామీ ఇచ్చారు. తన పడక గదిని కూడా సిద్ధం చేసుకోవాలని సమంత చెప్పడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.