రూమ‌ర్స్ వ‌ద్దంటున్న సీనియ‌ర్ న‌టి

నాగ‌చైత‌న్య‌- స‌మంతల విడాకుల‌పై ఎవ‌రికి తోచిన‌ట్టు వారు భాష్యం చెబుతున్నారు. విడిపోవ‌డానికి కార‌ణాలేంటో వాళ్లిద్ద‌రికి త‌ప్ప మూడో వ్య‌క్తికి తెలిసే అవ‌కాశం లేదు.  Advertisement ఇది భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య వ్య‌వ‌హారంగా నాగ‌చైత‌న్య తండ్రి నాగార్జున…

నాగ‌చైత‌న్య‌- స‌మంతల విడాకుల‌పై ఎవ‌రికి తోచిన‌ట్టు వారు భాష్యం చెబుతున్నారు. విడిపోవ‌డానికి కార‌ణాలేంటో వాళ్లిద్ద‌రికి త‌ప్ప మూడో వ్య‌క్తికి తెలిసే అవ‌కాశం లేదు. 

ఇది భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య వ్య‌వ‌హారంగా నాగ‌చైత‌న్య తండ్రి నాగార్జున ప్ర‌క‌ట‌న చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో నాగ‌చైత‌న్య‌- స‌మంత విడిపోవ‌డంపై సీనియ‌ర్ న‌టి ఖుష్బూ సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌న‌దైన రీతిలో స్పందించారు.

'భార్య భర్తల మధ్య ఏం జరిగిందనేది వాళ్లిద్దరికి తప్ప‌, మరెవరికి తెలియదు. వాళ్లు విడిపోవడానికి గల కారణాలు ఎవరికీ తెలి యదు. వాళ్ల ప్రైవసీని అందరం గౌరవించాలి. ఈ పరిస్థితి నుంచి బయటపడటానికి వాళ్లకు కాస్త సమయం ఇవ్వాలి. అప్పటి వరకు ఈ విషయంపై అనవరసరమైన ఊహాగానాలు, రూమర్స్‌ సృష్టించవద్దు' అని ఖుష్బూ ట్వీట్ చేశారు.

ఇలా వాళ్ల గురించి మాట్లాడొద్ద‌ని చెబుతూనే, విడాకుల అంశంపై ఏదో ర‌కంగా చ‌ర్చ పెడుతున్నారు. త‌మ‌ను అర్థం చేసుకోవాల‌ని, అన‌వ‌స‌ర చ‌ర్చ‌కు తావు ఇవ్వొద్ద‌ని నాగ‌చైత‌న్య‌- స‌మంత త‌మ విడాకుల ప్ర‌క‌ట‌న‌లో కోరిన సంగ‌తి తెలిసిందే. 

నాగ‌చైత‌న్య‌, స‌మంత మాత్రం త‌మ‌త‌మ ప‌నుల్లో నిమ‌గ్న‌మై, ఈ వ్య‌వ‌హారాన్ని మ‌రిచిపోయేందుకు య‌త్నిస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది.