ఏకగ్రీవ విజయాన్నందుకున్న అడివి శేష్

ప్రేక్షకులకు నచ్చిన సినిమాను క్రిటిక్స్ చీల్చిచెండాడిన సందర్భాలున్నాయి. క్రిటిక్స్ కు నచ్చిన సినిమాను ప్రేక్షకులు తిరస్కరించిన సందర్భాలున్నాయి. అయితే ఇటు సమీక్షకులు, అటు ప్రేక్షకులు ఇద్దరూ ఏకగ్రీవంగా మెచ్చిన సినిమాగా హిట్-2 నిలిచింది. ఈమధ్యకాలంలో…

ప్రేక్షకులకు నచ్చిన సినిమాను క్రిటిక్స్ చీల్చిచెండాడిన సందర్భాలున్నాయి. క్రిటిక్స్ కు నచ్చిన సినిమాను ప్రేక్షకులు తిరస్కరించిన సందర్భాలున్నాయి. అయితే ఇటు సమీక్షకులు, అటు ప్రేక్షకులు ఇద్దరూ ఏకగ్రీవంగా మెచ్చిన సినిమాగా హిట్-2 నిలిచింది. ఈమధ్యకాలంలో ఏ స్ట్రయిట్ తెలుగు సినిమాకూ ఈ గౌరవం దక్కలేదు.

అడివి శేష్ హీరోగా నటించిన ఈ సినిమాకు మొదటి రోజు రికార్డ్ ఓపెనింగ్స్ వచ్చాయి. రివ్యూస్ లో ఎలాగైతే మంచి రేటింగ్స్ వచ్చాయో, బాక్సాఫీస్ వద్ద వసూళ్లు కూడా అదే స్థాయిలో కనిపించాయి. అడవి శేష్ గతం సినిమా మేజర్ కు వచ్చిన ఓపెనింగ్స్ కంటే, 40శాతం ఎక్కువగా హిట్-2కు వచ్చాయి. శేష్ కెరీర్ లో ఇప్పటివరకు ఇదే బిగ్గెస్ట్ ఓపెనర్.

అటు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. అడివి శేష్ మూవీ సెలక్షన్ పై ఓవర్సీస్ ఆడియన్స్ కు ఉన్న నమ్మకంతో పాటు, హిట్ ఫ్రాంచైజీపై ఉన్న పాజిటివ్ ఫీల్, పార్ట్-2కు మంచి ఓపెనింగ్స్ తీసుకొచ్చింది. అడివి శేష్ కు ఓవర్సీస్ లో మరో మిలియన్ డాలర్ మూవీగా హిట్-2 అవతరించబోతోంది.

ఇక మొదటి రోజు వసూళ్ల విషయానికొస్తే.. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు 11 కోట్ల 27 లక్షల రూపాయల గ్రాస్ వచ్చినట్టు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు అఫీషియల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.

నైజాంలో ఈ సినిమా మొదటి రోజే కోటీ 92 లక్షల రూపాయల షేర్ కలెక్ట్ చేసి ట్రేడ్ ను ఆశ్చర్యపరిచింది. సోమవారానికి నైజాంలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకుంటుందనే అంచనాలున్నాయి.