మీనాక్షి మీద టాలీవుడ్ కన్ను

హీరోయిన్ల కొరతతో కిందా మీదా అవుతోంది టాలీవుడ్. కాస్త ఫెర్ ఫెక్ట్ ఫిగర్ కనిపిస్తే చాలు చాన్స్ లు వెన్నాడుతున్నాయి. డజన్ల కొద్దీ హీరోలు వున్నారు కానీ అంత మంది హీరోయిన్లు మాత్రం రావడం…

హీరోయిన్ల కొరతతో కిందా మీదా అవుతోంది టాలీవుడ్. కాస్త ఫెర్ ఫెక్ట్ ఫిగర్ కనిపిస్తే చాలు చాన్స్ లు వెన్నాడుతున్నాయి. డజన్ల కొద్దీ హీరోలు వున్నారు కానీ అంత మంది హీరోయిన్లు మాత్రం రావడం లేదు. 

బాలీవుడ్ నుంచి ఎవరెవరో వస్తున్నారు కానీ ఒకరిద్దరు మాత్రమే నిలదొక్కుకుంటున్నారు. ఖిలాడీ సినిమాతో తెలుగులోకి వచ్చింది మీనాక్షి చౌధరి మీద ఇప్పుడు టాలీవుడ్ దృష్టి పడింది.

తొలి సినిమా ఇచ్చట వాహనములు నిలుపరాదు పెద్దగా హిట్ కాకపోవడంతో ఎవ్వరూ అంతగా పట్టించుకోలేదు. కానీ మలి సినిమా ఖిలాడీ కాస్త గుర్తింపు తెచ్చింది కానీ అవకాశాలు ఇవ్వలేదు. ఇప్పుడు లేటెస్ట్ గా హిట్ 2 తో ఇప్పుడు అందరి దృష్టి ఈ ఇరవై ఆరేళ్ల హర్యానా ముద్దుగుమ్మ వైపు మళ్లింది.

మిస్ ఇండియా కిరీటం, డెంటల్ సర్జన్ డిగ్రీ, స్విమ్మింగ్, బాడ్మింటన్ లో పతకాలతో పాటు సినిమాలు అదనపు సరదా మీనాక్షికి. తెలుగులో ఇప్పుడు తొలి హిట్ పడింది. సిద్దు జొన్నలగడ్డ, నవీన్ పోలిశెట్టి లాంటి యంగ్ హీరోల సరసన నటిస్తే మరికాస్త ముందుకు వెళ్లిపోతుంది. హిట్ 2 తరువాత మీనాక్షి డేట్ ల గురించి ఎంక్వయిరీలు మొదలయినట్లు బోగట్టా.