ఇప్పటికే ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ వాళ్లు స్పందించేశారు. తమపై అధికార పార్టీ కక్షసాధింపు చర్యలకు దిగుతోందని.. అందుకే ఈ సెక్స్ రాకెట్ వ్యవహారాన్ని తెరమీదకు తెచ్చిందని వారు వాపోతున్నారు. ఇదంతా మధ్యప్రదేశ్ కథ. అయితే ఏకంగా మాజీ ముఖ్యమంత్రే ఒకరు శృంగార లీలలతో వీడియోలకు ఎక్కారంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. మధ్యప్రదేశ్ వ్యవహారమే అయినా దీనికి దేశవ్యాప్తంగా ప్రచారం లభిస్తూ ఉంది.
సెక్స్ రాకెట్ వ్యవహారాన్ని మధ్యప్రదేశ్ లోని కమల్ నాథ్ గవర్నమెంట్ గట్టిగానే డీల్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ సెక్స్ రాకెట్ మూలాలు బెంగళూరులో ఉన్నాయని తేలిందట. హనీ ట్రాప్ లో మొన్నటివరకూ మధ్యప్రదేశ్ లో అధికారంలో ఉండిన అనేకమంది ఉన్నారని వార్తలు వస్తున్నాయి.
వారి వీడియోలు, ఆడియోలు, ఫోన్ కాల్స్, మెసేజ్ లు.. మొత్తం అన్నింటినీ గుప్పిట్లో పెట్టుకున్నారట సూత్రధారులు. ఇంత పెద్ద సెక్స్ రాకెట్ వెనుక ఒక మహిళ ఉందనే వార్తలు కూడా వస్తున్నాయి. బెంగళూరు వేదికగా ఆమె మొత్తం వ్యవహారాన్ని పర్యవేక్షించిందని.. మాజీ సీఎం వీడియోలను, అలాగే పలువురు నేతల శృంగార లీలల వీడియోలు కూడా ఈ రాకెట్ గుప్పిట్లో ఉన్నాయని సమాచారం.
దీనిపై దర్యాప్తు కొనసాగుతూ ఉందని మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ స్పందిస్తోంది. తమను ఇరికిస్తున్నారని ఆ పార్టీ నేతలు అంటున్నారు. అయితే వారే ఇరుక్కున్నారని, ఇప్పుడు అందరి గుట్టూ బయటకు వస్తోందని.. కాంగ్రెస్ వాళ్లు అంటున్నారు! ఇప్పటికే ఈ వ్యవహారంలో పలువురు బీజేపీ నేతల అరెస్టు కూడా జరిగింది.