ప్రభాస్ – సిజి వర్క్ కే 80 కోట్లు

దర్శకుడు మారుతి, బాహుబలి ప్రభాస్ ల సినిమా రెండో షెడ్యూలు ప్రారంభం కాబోతొంది. కొద్ది రోజుల క్రితం జస్ట్ మూడు రోజులు ఫస్ట్ షెడ్యూలు పూర్తి చేసారు.  Advertisement ఒక విధంగా ఇది టెస్ట్…

దర్శకుడు మారుతి, బాహుబలి ప్రభాస్ ల సినిమా రెండో షెడ్యూలు ప్రారంభం కాబోతొంది. కొద్ది రోజుల క్రితం జస్ట్ మూడు రోజులు ఫస్ట్ షెడ్యూలు పూర్తి చేసారు. 

ఒక విధంగా ఇది టెస్ట్ షెడ్యూలు లాంటిది. రెండో షెడ్యూలు డిసెంబర్ 8 లేదా 9 నుంచి ప్రారంభమయ్యే అవకాశం వుంది. ఈ షెడ్యూలులో ఎవరెవరు పాల్గొంటారు, ఏ సీన్లు తీస్తారు అన్న వివరాలు ఇంకా తెలియాల్సి వుంది. ఇప్పటికే హీరోయిన్లను ఎంపిక చేయడం, ఫొటొ షూట్ లు చేయడం జరిగింది. అలాగే ఒక కీలక పాత్రకు సంజయ్ దత్ ను సంప్రదించడం పూర్తయింది.

ఇదిలా వుంటే మారుతి రాసుకున్న కథకు, దాంట్లోని ఫాంటసీ వరల్డ్ క్రియేషన్ కు దాదాపు 80 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని తెలుస్తోంది. మారుతి కదా కాస్త రీజనబుల్ బడ్జెట్ లో తీస్తారు సినిమా అన్న అభిప్రాయాలు వున్నాయి. కానీ ఈ సినిమా మాత్రం అలా కాదని, కాస్త భారీగానే వుంటుందని తెలుస్తోంది.

పీపుల్స్ మీడియా నిర్మించే ఈ సినిమా కథ, కథనాల మీద వీలయినంత గోప్యంగా వుంటున్నారు మారుతి. ఇప్పటి వరకు బయటకు వచ్చిన వాటికి అతీతంగా కథ వుంటుందని తెలుస్తోంది.