విశాఖ ఎంతో ఇచ్చింది పవన్ ..!

పవన్ కళ్యాణ్ సినీ నటుడు కాకముందు విశాఖలో నట శిక్షణ  కోసం కొన్నాళ్ళు ఉన్నారు. ఆయన స్టార్ హీరోలకు నటనలో మెలకువలు నేర్పే సత్యానంద్ వద్ద శిక్షణ పొందారు. ఆ రోజులు నాకు ఎపుడూ…

పవన్ కళ్యాణ్ సినీ నటుడు కాకముందు విశాఖలో నట శిక్షణ  కోసం కొన్నాళ్ళు ఉన్నారు. ఆయన స్టార్ హీరోలకు నటనలో మెలకువలు నేర్పే సత్యానంద్ వద్ద శిక్షణ పొందారు. ఆ రోజులు నాకు ఎపుడూ గుర్తే అని పవన్ జనసేనాని అయిన తరువాత కూడా చాలా సార్లు చెప్పుకున్నారు.

పవన్ వ్రుత్తిపరంగా, వ్యక్తిగతంగానూ విశాఖ ఎంతో ఉపయోగపడింది. అటువంటి విశాఖ అభివ్రుధ్ధిలో మరో మెట్టుగా రాజధాని నగరంగా అవతరించే అవకాశం ఉంటే పవన్ కాదూ కూడదు అనడం పట్ల విశాఖవాసులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

ఇక పవన్ కి విశాఖ అన్నీ ఇచ్చిందని వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమరనాధ్ అంటున్నారు. అన్నీ తీసుకుని ఇపుడు విశాఖ రాజధానిని వద్దు అనడం తగునా పవన్ అని ఆయన సూటిగానే ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు డైరెక్షన్లో పవన్ నడుస్తూ ఆ స్క్రిప్టుని చదువుతున్నారని కూడా ఆయన విమర్శించారు.

మరో ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అయితే పవన్ కి విశాఖ మీద ఇంత కోపమేంటి అని మండిపడ్డారు. తనను గాజువాకలో ఓడించారనే ఆయన ఇలా విశాఖ మీద  విషం కక్కుతున్నారని కూడా అంటున్నారు. రాజకీయం చేయడం అంటే నాలుగు  సినిమా డైలాగులు కొట్టడం కాదని కూడా ఎద్దేవా చేశారు. మూడు రాజధానులు కల్ల అంటూ పవన్ అపశకునం పలకడం దారుణమని అన్నారు.

మొత్తానికి మహేష్ బాబు  శ్రీమంతుడు సినిమాలో చెప్పినట్లుగా ఎంతో తీసుకున్న ఊరుకు తిరిగివ్వకపోతే లావు అయిపోతారు ఎవరైనా. అదే పవన్ అయినా సరే. అందువల్ల ఎన్నో హిట్లూ సినీరంగంలో అందించిన విశాఖ పట్ల ఈ కీలకసమయంలో పవన్ అనుకూలంగా ఉండాలనే  అంతా కోరుకుంటున్నారు.

గుమ్మడికాయల దొంగ అంటే, భుజాలు తడుముకుంటున్నారు

ఆర్జీవీకి సపోర్ట్ గా తరలి వచ్చిన ఫ్యాన్స్