నచ్చినంత మాంసం తినండి కానీ ఎముకలు మెడలో వేసుకుని తిరగొద్దు అన్నది వెనకటికి సామెత. అంటే చేసేపని చేయండి కానీ, అనవసరపు పబ్లిసిటీ వద్దు అని. కానీ అల్లుశిరీష్ కు ఈ విషయం అంతగా తెలిసినట్లు, పట్టినట్లు లేదు. అందుకే ఓ ట్వీట్ వేసి విపరీతమైన నెగిటివ్ కామెంట్లు మూటకట్టకుంటున్నాడు.
స్టయిలిష్ స్టార్ అల్లుఅర్జున్ స్నేహ బర్త్ డే సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ అల్లుశిరీష్ ఓ ట్వీటు వేసారు. ట్వీటులో మేటర్ సంగతి అలావుంచితే పెట్టిన ఫొటో ట్రోలింగ్ కు గురవుతోంది. ఆ ఫోటోలో స్నేహ గ్లామరస్ డ్రెస్ తో వుండగా అల్లు శిరీష్ ఆమెను హగ్ చేసుకున్నట్లుగా వుంది.
పేజ్ త్రీ సర్కిళ్లలో, హైఫై ఫ్యామిలీలలో ఇలాంటిది కామన్ లుక్ నే కానీ వదిన అంటే అమ్మతో సమానం, మరిది అంటే బిడ్డతో సమానం అనే తెలుగు సంప్రదాయ సమాజంలో మాత్రం అలాంటి ఫోటో చూస్తే సహించడం కష్టం. అందుకే ఆ ట్వీట్ కు కామెంట్లు విపరీతంగా పడుతున్నాయి. మాకు ఏమిటీ దరిద్రం, ఫొటో డిలీట్ చేయ్, ఇలా రకరకాలుగా కామెంట్లు వస్తున్నాయి.
గీతాక్యాంప్ జనాలు కూడా ఈ ట్వీట్ చూసి, 'వీళ్లకు చెప్పలేం..' ఈ కామెంట్లు, ఇతరత్రా వ్యవహారాలు చూస్తూ ఏం చేయలేం' అని ఆఫ్ ద రికార్డుగా కామెంట్ చేస్తున్నారు.