‘గోదావరి’ ఒడిలో మరో సినిమా

కలర్ ఫుల్ గా, మానవ, కుటుంబ సంబంధాలు, భావోద్వేగాలు నిండిన సినిమా అంటే చాలు మన మేకర్లకు ఈస్ట్ లేదా వెస్ట్ గోదావరి గుర్తుకు వచ్చేస్తుంది. ఆ అందాలు సినిమా నిండా పరుచుకుంటాయి. (శేఖర్…

కలర్ ఫుల్ గా, మానవ, కుటుంబ సంబంధాలు, భావోద్వేగాలు నిండిన సినిమా అంటే చాలు మన మేకర్లకు ఈస్ట్ లేదా వెస్ట్ గోదావరి గుర్తుకు వచ్చేస్తుంది. ఆ అందాలు సినిమా నిండా పరుచుకుంటాయి. (శేఖర్ కమ్ముల ఫిదా దీనికి మినహాయింపు). శతమానంభవతి తరువాత మరికొన్ని సినిమాలు కూడా ఇలాంటివి ఇటీవల వచ్చాయి. మళ్లీ ఇప్పుడు ఇంకో సినిమా వస్తొంది.

ఊరంతా అనుకుంటున్నారు, ఇదీ సినిమా పేరు. హీరో ఎవరో కాదు సీనియర్ హీరో కమ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ నరేష్ కొడుకు డాక్టర్ నవీన్. అతనితో పాటు అవసరాల శ్రీనివాస్ మరో హీరో. రావురమేష్, జయసుధ కీలకపాత్రధారులు. ఈ సినిమా ట్రయిలర్ ను ఇప్పుడు విడుదల చేసారు. చాల కలర్ ఫుల్ గా వుంది. గోదావరి జిల్లా అందాలు కన్నుల పండుగగా వున్నాయి. రావు రమేష్ మాట విరుపు డైలాగులు బాగానే వుండేట్లుగా వినిపిస్తున్నాయి.

బాలాజీ సానల అనే కొత్త దర్శకుడు అందిస్తున్న ఈ సినిమాకు రాధాకృష్ణన్ సంగీత దర్శకుడు. ఆనంద్, గోదావరి, చందమామ సినిమాల తరువాత మళ్లీ రాధాకృష్ణన్ పేరు అంతగా వినిపించలేదు. ట్రయిలర్ లో నేపథ్యసంగీతం వింటుంటే మళ్లీ వినిపించేట్లే వుంది.

అంతా బాగానే వుంది. కానీ హీరో నవీన్ కృష్ణ ఫేస్, ఫీలింగ్స్ నే సినిమా మీద సందేహాలు రేకెత్తిస్తున్నాయి.