మెగాఅల్లుడి ‘కండోమ్ ఫ్యాక్టరీ’?

విజేత సినిమా తరువాత మళ్లీ మొహానికి ఇప్పటి వరకు మేకప్ వేసుకోలేదు మెగా అల్లుడు కళ్యాణ్ ధేవ్. ఆ మధ్య ఓ సినిమా స్టార్ట్ చేసారు. మీనాక్షి అనే వర్కింగ్ టైటిల్ కూడా అనుకున్నారు.…

విజేత సినిమా తరువాత మళ్లీ మొహానికి ఇప్పటి వరకు మేకప్ వేసుకోలేదు మెగా అల్లుడు కళ్యాణ్ ధేవ్. ఆ మధ్య ఓ సినిమా స్టార్ట్ చేసారు. మీనాక్షి అనే వర్కింగ్ టైటిల్ కూడా అనుకున్నారు. ఓ నలభైశాతం వరకు చేసి, మరెందుకో ఆపేసారు. బడ్జెట్ సమస్యలో మరోటో అని వినిపించింది.

అయితే లేటెస్ట్ గా మరో సబ్జెక్ట్ ను కళ్యాణ్ థేవ్ ఓకె చేసినట్లు తెలుస్తోంది. రంగస్థలం మాదిరిగా పీరియాడిక్ సినిమా ఇది అని, సినిమాకు కండోమ్ ఫ్యాక్టరీ అనే టైటిల్ ఫిక్స్ చేసుకున్నారని గ్యాసిప్ వినిపిస్తోంది. పులివాసు అనే డైరక్టర్ ఈ సినిమాకు పని చేయబోతున్నట్లు బోగట్టా.

1980ల కాలంలో కండోమ్ ఫ్యాక్టరీలో హీరో పనిచేయడం వంటి లైన్ ఏదో వుందని, ప్రస్తుతం ఈ సినిమా స్టార్ట్ చేసే ఆలోచనలో కళ్యాణ్ థేవ్ వున్నారని తెలుస్తోంది. అయితే ఎప్పుడు స్టార్ట్ అవతుంది? అవుతుందా? కాదా? అన్నది ఇంకా చూడాల్సి వుంది. ప్రస్తుతానికి అయితే కళ్యాణ్ ధేవ్ లేటెస్ట్ సినిమా సంగతులు ఇవీ.

హీరో ఫోన్ చేయగానే సెకండ్లలో వచ్చిన డైరెక్టర్..?