చంద్రబాబు అలా కోడెలను ఓదార్చారట!

కేసుల విషయంలో ధైర్యంగా పోరాడాలని ఏపీ మాజీ అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ని ఓదార్చారట టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు. కోడెల సంతాప సభలో ఎక్కడ లేని ప్రేమాభిమానాల్ని చంద్రబాబు కురిపించేస్తోంటే, తెలుగు తమ్ముళ్ళే…

కేసుల విషయంలో ధైర్యంగా పోరాడాలని ఏపీ మాజీ అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ని ఓదార్చారట టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు. కోడెల సంతాప సభలో ఎక్కడ లేని ప్రేమాభిమానాల్ని చంద్రబాబు కురిపించేస్తోంటే, తెలుగు తమ్ముళ్ళే విస్తుపోయారు మరి.! 'కోడెల శివప్రసాద్‌, ఒక్క రూపాయి తీసుకుని మాత్రమే మంచి వైద్యం చేసేవారు.. చాలామందికి ఆయన డబ్బులు తీసుకోకుండా వైద్యం చేయడమే కాకుండా, వారికి అవసరమైన మందుల్ని కూడా ఇచ్చేవారు.. అలాంటి వ్యక్తి లక్ష రూపాయల విలువ చేసే ఫర్నిచర్‌ దొంగిలించడమా.?' అంటూ చంద్రబాబు మొసలి కన్నీరు కార్చేశారు.

పోయినోళ్ళంతా మంచోళ్ళే.. అన్నట్టుంది చంద్రబాబు వ్యవహారం. కోడెల విషయంలో చంద్రబాబే తొలి దోషి.. అని కోడెల అభిమానులే చెబుతున్నారు. నిజానికి, గుంటూరు జిల్లాలో కోడెల వ్యతిరేక పవనాలు వీయడానికి చాలా కారణాలున్నాయి. కోడెల కుటుంబ సభ్యులపై ఆరోపణలు ఓ ఎత్తు.. చంద్రబాబు అత్యంత వ్యూహాత్మకంగా కోడెలకు వ్యతిరేకంగా చేయించిన రాజకీయ కుట్ర ఇంకో ఎత్తు. ఎన్నికల్లో కోడెలకు టిక్కెట్‌ ఇవ్వడానికి సైతం చంద్రబాబు మీనమేషాల్లెక్కెట్టిన వైనాన్ని ఎలా మర్చిపోగలం.?

నిజానికి, ఈ తరహా రాజకీయాలు చంద్రబాబుకి కొత్తేమీ కాదు. కోడెల మరణానంతరం, వైఎస్‌ జగన్‌ ప్రభుత్వాన్ని నిలదీసినంత గట్టిగా, కోడెలను సమర్థిస్తూ వైఎస్‌ జగన్‌ సర్కార్‌ని అసెంబ్లీ ఫర్నిచర్‌ విషయమై చంద్రబాబు నిలదీసి వుంటే.. కోడెల శివప్రసాద్‌ ఆత్మహత్య చేసుకునేవారు కాదేమో. రాజకీయ నాయకులకు కేసులు కొత్త కాదు. ఆ మాటకొస్తే, కోడెల శివప్రసాద్‌ చాలా కేసుల్ని ఎదుర్కొన్నారు. ఇది జగమెరిగిన సత్యం.

మొత్తమ్మీద, కోడెల పేరుతో చంద్రబాబు ఇంకెన్నాళ్ళు 'శవ రాజకీయాలు' చేస్తారోగానీ, ఎన్నికల తర్వాత కాస్తో కూస్తో మిగిలిన ఆ మాత్రం పరువు కూడా టీడీపీ, చంద్రబాబు.. కోడెల మరణం తర్వాత పోగొట్టేసుకున్నారన్నది నిర్వివాదాంశం.