ఇటీవలే హిందీ విషయంలో కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యల పట్ల బాగా వ్యతిరేకత వ్యక్తం అయినది తమిళనాడు నుంచినే. దేశంపై హిందీని రుద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారంటూ అమిత్ షాపై తమిళ రాజకీయ నేతలు మండిపడ్డారు. డీఎంకే వాళ్లు తీవ్రంగా స్పందించారు. అమిత్ షా ఏదో యథాఫలంగా ఆ మాట మాట్లాడినా తమిళనాడు నుంచి తీవ్రమైన స్పందన వ్యక్తం అయ్యింది. తమిళులు స్పందించే సరిగి కన్నడీగులు రియాక్ట్ అయ్యారు. అక్కడ అయితే బీజేపీకి చెందిన ముఖ్యమంత్రే ‘కన్నడ ఫస్ట్’ అని అనే శారు.
ఇలాంటి నేపథ్యంలో దక్షిణాదిని శాంతపరిచే ప్రయత్నం చేస్తున్నట్టుగా మాట్లాడారు మోడీ. తమిళనాడుకు వెళ్లిన మోడీ అక్కడ తమిళ భాషను కీర్తించారు. తమిళం అత్యంత పురాతన భాష అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాదట ఐక్యరాజ్యసమితిలో తన ప్రసంగంలో కొన్ని తమిళ పదాలు దొర్లినట్టుగా మోడీ చెప్పుకొచ్చారు. మొత్తానికి డ్యామేజ్ కవరేజ్ ప్రయత్నాలు చేస్తున్నారు ప్రధానమంత్రి మోడీ అని స్పష్టం అవుతోంది.
అమిత్ షా వ్యాఖ్యల పట్ల తమిళనాడులోని బీజేపీ ఫ్రెండ్ రజనీకాంత్ కూడా అసహనం వ్యక్తం చేశారు. హిందీని రుద్దవద్దని రజనీ వ్యాఖ్యానించారు. దీంతో బీజేపీ హై కమాండ్ కు పరిస్థితి అర్థం అయినట్టుగా ఉంది. అందుకే ఇలా నష్టనివారణ ప్రయత్నాలు సాగిస్తున్నట్టుగా ఉన్నారు.