ఈ ఏడాది వచ్చిన భారీ సినిమాలు. బాహుబలి తరువాత వచ్చిన భారీ సినిమాలు. సైరా.. సాహో. ఇప్పటికే సాహో సినిమా వచ్చింది. తెలుగునాట 80 కోట్లకు పైగా కొల్లగొట్టింది. బాలీవుడ్ లో భారీ కలెక్షన్లు సాధించింది. మరి సైరా ఎలా వుంటుందో మరో మూడు రోజుల్లో తేలిపోతుంది.
ఇలాంటి నేపథ్యంలో అసలు సాహోకి సైరాకి వున్న తేడాలేమిటి? అడ్వాంటేజ్ లు ఏమిటి? ఓసారి చూద్దాం. నిజానికి ఓ సినిమాకు మరో సినిమాకు పోలిక వుండదు. కానీ ఈ రెండు సినిమాలు బాహుబలి తరువాత టాలీవుడ్ నుంచి వచ్చే రెండు భారీ సినిమాలు ఇవి. అందుకే జస్ట్ ఒకసారి అలా చూడడం.
సాహో సినిమా హాలీవుడ్ స్టయిల్ యాక్షన్ సినిమా
సైరా సినిమా పక్కా తెలుగు నేటివిటీ కథ.
సాహో… ఓ మోడరన్ ఆర్ట్
సైరా…. ఓ ట్రాడిషనల్ ఫెయింటింగ్.
సాహో హీరో ఆల్ ఇండియా వైడ్ గా క్రేజ్ వున్న సూపర్ స్టార్..
సైరా హీరో చిరకాలంగా తెలుగు జనాల గుండెల్లో గూడు కట్టేసుకున్న మెగాస్టార్.
హీరోయిన్ అందాల కోసం, యువతరాన్ని టార్గెట్ చేస్తూ తీసిన సినిమా.
సైరా.. ఇద్దరు హీరోయిన్లు. తెలుగు మహిళలకు నచ్చే మేకప్, పాత్రధారణ. అందువల్ల తెలుగింటి మహిళలు వెళ్లడానికి ఆసక్తి కలిగించే సినిమా.
సాహో.. కథ అర్థం చేసుకోవడానికి కాస్త ఆలోచించాలి.
సైరా.. అరటిపండు వలిచిపెట్టినట్లు వుండే కథ.
సాహో..స్క్రీన్ ప్లే బేస్డ్ కథ. కంటిన్యూగా జాగ్రత్తగా ఫాలో కావాలి.
సైరా.. కన్ను ముక్కు, చెవులు ఇలా అన్నీ ఎక్కడివి అక్కడ పద్దతిగా అమర్చిన టైపు. పండిత జనమే కాదు, పామర జనం కూడా అర్థం చేసేసుకోవచ్చు.
సేల్స్ పరంగా సాహో, సైరా దాదాపు ఒకటే రేంజ్. బాలీవుడ్ లో కొంచెం తేడా అనుకోవాలి.
అయితే సైరాకు సాహో వున్నంత క్రేజ్ బాలీవుడ్ లో వుంటుందా? అన్నది చూడాలి.
అలాగే సాహోకు మంచి డేట్ దొరకలేదు. కానీ సైరాకు మంచి డేట్, సెలవులు అడ్వాంటేజ్.
అలాగే సాహోకు బాలీవుడ్ లో పోటీలేదు. కానీ సైరాకు గట్టి పోటీ వుంది.
మరోరోజు దాటితే సైరా ఎలా వుంటుందో? ఎలా వుండబోతోందో తెలిసిపోతుంది.
ఆ తరువాత ఈ రెండింటికీ మధ్య సామీప్యాలు, తేడాలు మరింత క్లియర్ గా తెలుస్తాయి.