బెల్లంకొండకు కథ చెప్పిన శ్రీనువైట్ల

దర్శకుడు శ్రీనువైట్ల గుర్తున్నారు కదా? ఒకప్పుడు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్లు ఇచ్చిన డైరక్టర్. ఆ తరువాత బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్లు ఇచ్చిన డైరక్టర్ కూడా ఆయనే. ఆయన లేటెస్ట్ డిజాస్టర్…

దర్శకుడు శ్రీనువైట్ల గుర్తున్నారు కదా? ఒకప్పుడు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్లు ఇచ్చిన డైరక్టర్. ఆ తరువాత బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్లు ఇచ్చిన డైరక్టర్ కూడా ఆయనే. ఆయన లేటెస్ట్ డిజాస్టర్ అమర్ అక్బర్ ఆంథోని. ఆ తరువాత ఆయన పేరు మళ్లీ వినిపించలేదు.

ఇన్నాళ్లకు ఆయన పేరు వినిపిస్తోంది. హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కు ఓ మాంచి కథ వినిపించినట్లు తెలుస్తోంది. అన్నివిధాలా పవర్ ప్యాక్డ్ గా వున్న కథను శ్రీనువైట్లు వినిపించినట్లు బోగట్టా. అయితే ఇంకా బెల్లంకొండ సైడ్ నుంచి రియాక్షన్ ఏమిటి? అన్నది తెలియాల్సి వుంది.

బెల్లంకొండ శ్రీనివాస్ ఇటీవలే రాక్షసుడు సినిమాతో హిట్ కొట్టారు. తరువాత సినిమా ఏదీ కమిట్ కాలేదు. హిందీ డిజిటల్ మార్కెట్ వుంది. తెలుగునాట కూడా ఫరవాలేదు. కానీ శ్రీనువైట్ల ముందు చెప్పే బడ్జెట్ ఒకటి, తరువాత అయ్యేది మరొకటి అని టాక్ వుంది. ఈ విషయం ఆయనతో సినిమాలు చేసిన నిర్మాతలకు అనుభవమే.

మరి బెల్లంకొండ శ్రీనివాస్ తో, ఆయన నిర్మాతలతో ఎలా వుంటుందో? చూడాలి.

హీరో ఫోన్ చేయగానే సెకండ్లలో వచ్చిన డైరెక్టర్..?