అన్ని ప్రాజెక్టులు నేమ్ అండ్ ఫేమ్ రెండూ తీసుకురావు. కొన్ని ప్రాజెక్టులు డబ్బులు మాత్రమే ఇస్తాయి. కానీ సైరా లాంటి ప్రాజెక్టులు దర్శకులకు పేరు కూడా తీసుకువస్తాయి. సైరా సినిమా దర్శకుడు సురేందర్ రెడ్డికి మంచి పేరు తీసుకురావడం పక్కా. కేవలం ఇప్పటి వరకు రాజమౌళి మాత్రమే ఈ రేంజ్ కథాంశాలు, భారీ సినిమాలు చేసారు. సాహో సినిమా విషయంలో దర్శకుడు సుజిత్ ది మాత్రమే క్రెడిట్ కాదు. అక్కడ బాహుబలి టీమ్ మాదిరి టీమ్ వుంది.
కానీ సైరా వ్యవహారం వేరు. ఇక్కడ కేవలం స్క్రిప్ట్ వరకే చాలామంది వున్నారు. కానీ సినిమా మేకింగ్ భారం మొత్తం సురేందర్ రెడ్డి మీదనే వుంది. ప్రొడక్షన్ కు చాలామంది వుండొచ్చు కానీ, క్రియేటివిటీ పార్ట్ అంతా సురేందర్ దే. అందువల్ల సైరా హిట్ అయితే తొలుత వచ్చే పేరు సురేందర్ కే. చిరంజీవి 150వ సినిమాకు దర్శకుడు వివి వినాయక్ కు పేరు రాలేదు్. కారణం అది రీమేక్ కావడం. కానీ సైరా అలా కాదు. సురేందర్ రెడ్డి రీసెర్చి చేసి, అప్ డేట్ గా తయారుచేసుకున్న స్క్రిప్ట్.
సో, ఆ విధంగా నేమ్ రావడం పక్కా. మరి ఫేమ్ సంగతేమిటి? ఈ సినిమాకు రెమ్యూనిరేషన్ పరంగా సురేందర్ రెడ్డికి 12 కోట్ల వరకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఆపైన మరేమన్నా ఇస్తారా? అన్నది సినిమా విడుదలై, కమర్షియల్ గా, అన్ని విధాలుగా సక్సెస్ సాధించిన తరువాత తెలియాల్సి వుంటుంది. ప్రస్తుతానికి అయితే రెమ్యూనిరేషన్ పరంగా 12 కోట్ల వరకు లభించినట్లు తెలుస్తోంది.
దాదాపు రెండేళ్లు మరే ప్రాజెక్టు టేకప్ చేయకుండా దీని మీదే వుండిపోయారు. ఆ విధంగా చూసుకుంటే తక్కువే. రెండేళ్లలో రెండు సినిమాలు చేస్తే ఇరవై కోట్లు వచ్చి వుండేవి. కానీ ప్రాజెక్టుతో వచ్చే పేరుతో చూసుకుంటే మంచి రెమ్యూనిరేషన్ నే. ఈ సినిమా హిట్ కొడితే సురేందర్ రెడ్డి డిమాండ్, ఆయన పారితోషికం ఓ లెవెల్ లో వుంటాయి.