హీరోయిన్ కంగనా రనౌత్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈసారి సెక్స్ పై ఆమె సూటిగా స్పందించింది. సెక్స్ చేయాలనిపిస్తే ఆపుకోవద్దని, వెంటనే ఆ కోరిక తీర్చుకోవాలని అంటోంది కంగన. అయితే సెక్స్ విషయంలో బాధ్యతాయుతంగా ఉండాలని సూచిస్తోంది. ముంబయిలో జరిగిన ఓ ఈవెంట్ లో మాట్లాడిన కంగన, తన సెక్స్ లైఫ్ మేటర్ కూడా బయటపెట్టింది.
“ప్రతి ఒక్కరి జీవితంలో సెక్స్ అనేది ముఖ్యమైన అంశం. సెక్స్ చేయాలనుకుంటే ఏమాత్రం ఆలోచించకుండా ఆ పని చేసేయండి. మరీ అతిగా ఆలోచించకండి. తమ పిల్లలు సెక్స్ చేసుకుంటే తల్లిదండ్రులు హ్యాపీగా ఫీలవ్వాలి. పిల్లలు సెక్స్ విషయంలో బాధ్యతాయుతంగా మెలగాలి. నేను సెక్స్ విషయంలో చాలా యాక్టివ్ గా ఉన్నానని తెలుసుకున్నప్పుడు నా తల్లిదండ్రులు షాక్ కు గురయ్యారు.”
ఇలా సెక్స్ పై తన అభిప్రాయాల్ని కుండబద్దలుకొట్టినట్టు వెల్లడించింది కంగన రనౌత్. భారత్ లో దశాబ్దాలుగా సెక్స్ పై చర్చలు జరుగుతున్నాయని, అలాంటి చర్చల కంటే నేరుగా సెక్స్ లో పాల్గొంటేనే మంచిదని సూచిస్తోంది ఈ హీరోయిన్. ఒకప్పట్లా ఫీలింగ్స్ అన్నీ పెళ్లి వరకు దాచుకొని ఉంచుకోవడం మంచిది కాదంటున్న కంగన, కాస్త బాధ్యతతో వ్యవహరిస్తే ఎవరైనా సెక్స్ ను ఎంజాయ్ చేయొచ్చని సూచిస్తోంది. కండోమ్ యాడ్స్ వచ్చిన కొత్తలో టీవీ ఛానెల్ మార్చడానికి తల్లిదండ్రులు తొందరపడేవారని, ఆ రోజులు ఇప్పుడు లేవంటోంది కంగన.
ఎప్పటికప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కంగనాకు హాబీగా మారిపోయింది. ఇప్పటికే పలు వివాదాలకు కేంద్ర బిందువైన ఈ బ్యూటీ, తాజా వ్యాఖ్యలతో కొన్ని రాజకీయ పార్టీల నిరసనల్ని ఎదుర్కోవాల్సి రావొచ్చు.