టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ఐటీ పరిశ్రమలశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుకు ఏపీ సీఎం వైఎస్ జగన్మో హన్‌రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేటీఆర్ తన 44వ బర్త్‌డేను జరుపుకుంటున్న విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా ఆయనకు ప్రముఖుల నుంచి పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కేసీఆర్ కుటుంబంతో ఏపీ సీఎం జగన్‌కు సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ సందర్భంగా జగన్ ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.
‘ప్రియమైన నా సోదరుడు తారక్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆ దేవుడు మీకు ఆరోగ్యాన్ని, అంతులేని సంతోషాలను ప్రసాదించాలి’ అని జగన్ ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు. ఇందుకు స్పందించిన కేటీఆర్.. ‘ధన్యవాదాలు అన్నా’ అని బదులిచ్చారు.
జగన్‌తో పాటు కేటీఆర్‌కు శుభాకాంక్షలు చెప్పిన వారిలో మెగాస్టార్ చిరంజీవి, తెలంగాణ మంత్రి హరీష్‌రావు, ఎంపీ జోగినపల్లి సంతోష్, గుంటూరు జిల్లా చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని, హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్ తదితరులు ఉన్నారు.