ఒకపక్క అదిగో గంటా శ్రీనివాసరావు వైకాపాలోకి వచ్చేస్తున్నారు అంటూ హడావుడి.
మరోపక్క గంటా వస్తే, పార్టీలో ఏం తలకాయనొప్పులు వస్తాయో అంటూ మరో హడావుడి.
ఇవన్నీ ఇలా వుండగానే మరోపక్కన గంటా ఎంట్రీ అంత వీజీ కాదు అని టాక్ వినిపిస్తోంది. విజయసాయిరెడ్డి ఆసుపత్రిలో వున్న టైమ్ చూసుకుని మంత్రి బొత్స సత్యనారాయణ ఈ ఫీలర్లకు ప్రాణం పోసారనే టాక్ వినిపిస్తోంది. కానీ విజయసాయి రెడ్డిని కాదని, విజయసాయి రెడ్డిని సంప్రదించకుండా విశాఖ లో పార్టీ విషయాల్లో జగన్ నిర్ణయం తీసుకోరని బోగట్టా.
ఇటీవలే జగన్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల పార్టీ వ్యవహారాలను వైవి, సజ్జల, విజయసాయిలకు కేటాయించి, వర్గాలు, గ్రూపులు లేకుండా, వారిలో వారు కొట్టాడుకోకుండా చూసుకోమని క్లియర్ గా చెప్పారు ఇలాంటి టైమ్ లో సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ విశాఖ వ్యవహారాల్లో వేలు పెడతారా? అలాంటి అవకాశం జగన్ ఇస్తారా? అన్నది పాయింట్.
అసలు బొత్సను, సజ్జలను విశాఖ పార్టీ విషయాల్లో అస్సలు జగన్ ఎంటర్ టైన్ చేయరని, గంటా చేరిక అనేది అస్సలు వుండకపోవచ్చని కూడా వినిపిస్తోంది. విజయసాయి ని కాదని, సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాదని జగన్ అంతటి నిర్ణయం తీసుకునే అవకాశం చాలా తక్కువని అంటున్నారు. కానీ గంటా ప్రయత్నాలు, ఆయన వెనుక వుండి మిగిలిన వారు చేసే ప్రయత్నాలు సాగుతూనే వుంటాయేమో?