సమంత విడాకుల నేపథ్యంలో నటుడు సిద్ధార్థ్ ఏదో ట్వీట్ పోస్టు చేశాడు. అది పరోక్షంగా సమంతను ఉద్దేశించే అనే టాక్ నెట్టింట నడుస్తూ ఉంది. గతంలో సిద్ధార్థ్ తో సమంత ప్రేమాయణం నేపథ్యంలో.. ఈ ప్రచారం ఇప్పుడు గట్టిగా సాగుతూ ఉంది.
మరి ఈ వ్యవహారంలో సమంతను సిద్ధార్థ్ ఏదో నిందించాడనే అనుకుందాం. ఆమెను మోసగత్తెగా అభివర్ణించాడనే కాసేపు అనుకుందాం! అయితే.. సిద్ధార్థ్ కు కూడా ఒక గతం ఉంది. ఆ గతంలో ఒక వివాహం కూడా ఉంది! మరి ఒకవేళ సిద్ధార్థ్ ను సమంత వదిలించుకుని ఉంటే, అది మోసమే అయితే.. అంతకు ముందు సిద్ధార్థ్ జీవితంలో జరిగిన దాన్ని ఏమనాలో మరి!
సిద్ధార్థ్ – సమంతలు పెళ్లి చేసుకోలేదు. ప్రేమో, సహజీవనమో.. అని మీడియాలో ప్రచారం జరిగింది. అయితే రూమర్లను వారు ఖండించనూ లేదు, సమర్థించనూ లేదు. తమ గురించి ఎవరేమనుకుంటే తమకేం అన్నట్టుగా అప్పుడు వ్యవహరించారు.
అయితే ఇప్పుడు నిజంగానే సిద్ధార్థ్ నర్మగర్భపు ట్వీట్లతో సమంతను నిందించాలనుకుంటే.. అప్పుడు అతడి గత వ్యవహారం కూడా చర్చకు రావాల్సిన అంశమే. సిద్ధార్థ్, సమంతలకు పెళ్లి కాకుండానే.. వీడిపోయారనుకుంటే.. మరి అప్పటికే సిద్ధార్థ్ కు పెళ్లి అయ్యింది.
కారణం ఏదైనా.. తన భార్య నుంచి సిద్ధార్థ్ విడిపోయాడు! విడిపోవడమే.. దోషం అనుకుంటే, ఆ దోషం సిద్ధార్థ్ కూడా ఇంకోరి విషయంలో చేసినట్టే. ఇక సమంతతో విడిపోయిన అనంతరం కూడా.. బాలీవుడ్ లో సిద్ధార్థ్ ఒక ప్రేమాయణాన్ని నడిపిన కథలు మీడియాలో వచ్చాయి. అది కూడా బ్రేకప్ అయ్యింది. మరి… సమంతను నిందించే అర్హత సిద్ధార్థ్ ఉన్నట్టా? అది అతడికీ తెలుసు కదా. కాబట్టి.. సమంతను ఉద్దేశించి సిద్దార్థ్ ట్వీట్ చేసి ఉండకపోవచ్చు! కదా.. సిద్ధార్థ్?