ఎట్టకేలకు బాలయ్య షోలో స్టార్ ఎట్రాక్షన్

సీజన్-1లో పెద్ద హీరోలందర్నీ కవర్ చేశారు. చిరంజీవి లాంటి ఒకరిద్దరు మాత్రమే మిగిలిపోయారు. దీంతో సీజన్-2కు వచ్చేసరికి స్టార్ ఎట్రాక్షన్ తగ్గిపోయింది. పేరుకు స్టార్స్ వస్తున్నారు కానీ ఏదో వెలితి. ఆ ప్రభావం సబ్…

సీజన్-1లో పెద్ద హీరోలందర్నీ కవర్ చేశారు. చిరంజీవి లాంటి ఒకరిద్దరు మాత్రమే మిగిలిపోయారు. దీంతో సీజన్-2కు వచ్చేసరికి స్టార్ ఎట్రాక్షన్ తగ్గిపోయింది. పేరుకు స్టార్స్ వస్తున్నారు కానీ ఏదో వెలితి. ఆ ప్రభావం సబ్ స్కైబర్లు, వాఛింగ్ అవర్స్ పై కూడా పడింది. దీంతో అన్ స్టాపబుల్ సీజన్-2 పడుతూలేస్తూ సాగుతోంది.

ఎట్టకేలకు ఈ కార్యక్రమానికి ఓ ఊపు తీసుకొచ్చారు నిర్వహకులు. అన్ స్టాపబుల్ కోసం ప్రభాస్ ను రంగంలోకి దించుకున్నారు. కేవలం ప్రభాస్ ఒక్కడే కాదు. అతడితో పాటు మరో పొడుగు హీరో గోపీచంద్ ను కూడా తీసుకొస్తున్నారు. వీళ్లిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అనే సంగతి తెలిసిందే. అందుకే ఇలా ఇద్దర్నీ కలిపి సింగిల్ ఫ్రేమ్ లో ఫిక్స్ చేశారు.

ఈ ఎపిసోడ్ షూటింగ్ కు తేదీ కూడా ఫిక్స్ అయింది. 11వ తేదీన ఈ ఎపిసోడ్ ను షూట్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ కూడా మొదలైంది. ఈసారి ప్రభాస్ కోసం స్పెషల్ ప్రోమో లాంటిది ప్లాన్ చేస్తున్నారు. ఈ వెరీ వెరీ స్పెషల్ ఎపిసోడ్ ను డిసెంబర్ 31న న్యూ ఇయర్ కానుకగా స్ట్రీమింగ్ చేయాలని అనుకుంటున్నారు.

సీజన్-2ను చంద్రబాబు-లోకేష్ తో లాంచ్ చేసింది 'ఆహా'.  ఆ తర్వాత విశ్వక్ సేన్-సిద్ధు జొన్నలగడ్డ, శర్వానంద్-అడివి శేష్ జంటలుగా వచ్చినప్పటికీ పెద్ద హైప్ రాలేదు. ఇక రీసెంట్ గా కిరణ్ కుమార్ రెడ్డి, సురేష్ రెడ్డితో చేసిన షో దాదాపు ఫ్లాప్ అనేది ఇంటర్నల్ టాక్.

ఈ నేపథ్యంలో ప్రభాస్ ను రంగంలోకి దించారు. కాకపోతే ప్రభాస్ తో మాట్లాడించడం బాలయ్య వల్ల అవుతుందా అనేది ఇప్పుడు అందరి డౌట్. పక్కనే ఉన్న గోపీచంద్ ను కూడా మాట్లాడించడం కాస్త కష్టమే. ఈ సంగతి పక్కనపెడితే.. ప్రభాస్ రాకతో సీజన్-2కు ఎట్టకేలకు స్టార్ ఎట్రాక్షన్ వచ్చినట్టవుతుంది.