‘అర్జున్’కు మంచి రోజులు

హీరో నిఖిల్ నటించిన సినిమా అర్జున్ సురవరం. సినిమా అంతా పూర్తయిపోయి, ఫస్ట్ కాపీ రెడీ అయిపోయిన తరువాత వచ్చిన అనేకానేక సమస్యలు, అవాంతరాల వల్ల విడుదల ఆగిపోయింది. ప్రమోషన్లు కూడా జరిగిపోయాయి. సినిమా…

హీరో నిఖిల్ నటించిన సినిమా అర్జున్ సురవరం. సినిమా అంతా పూర్తయిపోయి, ఫస్ట్ కాపీ రెడీ అయిపోయిన తరువాత వచ్చిన అనేకానేక సమస్యలు, అవాంతరాల వల్ల విడుదల ఆగిపోయింది. ప్రమోషన్లు కూడా జరిగిపోయాయి. సినిమా మీద కాస్త ఆసక్తి వచ్చింది. తమిళంలో హిట్ అయిన సినిమాకు రీమేక్ కావడంతో కాస్త అంచనాలు కూడా వచ్చాయి. కానీ ఎప్పుడయితే సినిమా విడుదల కాలేదో అంతా అలా ఆగిపోయింది.

నిఖిల్ కు కూడా టైమ్ బాలేదు. శ్వాస సినిమా ఆగిపోయింది. కార్తికేయ సినిమా అలావుంది. దాంతో నిఖిల్ కూడా సైలంట్ అయిపోయాడు. ఇలాంటి నేపథ్యంలో అర్జున్ సురవరం అవాంతరాలు ఒకటి ఒకటిగా తొలిగించే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఇవి కొంత వరకు ఫలితాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే, సమస్యలు అన్నీ కొద్దిరోజుల్లో తొలిగిపోయి, విడుదలకు మార్గం సుగమం అవుతుందని తెలుస్తోంది.

అయితే ఇప్పటికే ఒకటి రెండుసార్లు డేట్ ప్రకటించి, వాయిదా వేసినందున, ఈసారి ముందుగా డేట్ ప్రకటించే ఆలోచన చేయడంలేదు. అన్నీ పక్కాగా క్లియర్ అయిన తరువాత జస్ట్ వన్ వీక్ లేదా పదిరోజుల ముందు ప్రకటించి, చకచకా ప్రమోషన్ చేసి, విడుదల చేసే ఆలోచనలో వున్నారు అర్జున్ సురవరం నిర్మాత టాగోర్ మధు.

చిరంజీవి గారి వల్లనే అవన్నీ సాధ్యం అయ్యాయి