ఏం జరిగిందో తెలిసేలోపే యాక్సిడెంట్

చాణక్య సినిమాను రిలీజ్ కు రెడీ చేశాడు గోపీచంద్. ఈ సినిమాను మాత్రం అతడు జీవితంలో మరిచిపోలేడు. ఎందుకంటే ఈ సినిమా షూటింగ్ టైమ్ లోనే పెద్ద యాక్సిడెంట్ జరిగి తీవ్రంగా గాయపడ్డాడు ఈ…

చాణక్య సినిమాను రిలీజ్ కు రెడీ చేశాడు గోపీచంద్. ఈ సినిమాను మాత్రం అతడు జీవితంలో మరిచిపోలేడు. ఎందుకంటే ఈ సినిమా షూటింగ్ టైమ్ లోనే పెద్ద యాక్సిడెంట్ జరిగి తీవ్రంగా గాయపడ్డాడు ఈ హీరో. గోపీచంద్ కు యాక్సిడెంట్స్, దెబ్బలు కొత్తకాదు. కానీ ఈ ప్రమాదం మాత్రం ఊహించలేదంటున్నాడు.

“ఫైట్ అంతా చేశాం. ఆ ఫైట్ కు సంబంధించి లాస్ట్ డే షూట్ అది. చాలా చిన్న షాట్. రిస్కీ షాట్స్ అన్నీ ఆల్రెడీ చేసేశాం. పరుగెత్తుకుంటూ వచ్చి బైక్ తీసుకొని వెళ్లాలి, వెనక నుంచి చేజ్ చేస్తుంటారు. బైక్ ఆల్రెడీ స్టార్ట్ చేసి పెట్టారు. అప్పటికే బైక్ ప్రాబ్లమ్ గా ఉండడంతో నేను వచ్చి తీయగానే ఫుల్ రైజ్ అయిపోయింది. వదిలేద్దామంటే ఎదురుగా 2 కెమెరాలు, కెమెరామెన్లు ఉన్నారు. అందుకే కంట్రోల్ చేయడానికి ట్రై చేశాను. కానీ బండి అదుపులోకి రాలేదు. సెకెన్లలో అంతా జరిగిపోయింది. ఏం జరిగిందో తెలిసేలోపే కట్ అయిపోయింది, రక్తం కారడం స్టార్ట్ అయింది.”

ఓ మారుమూల ప్రాంతంలో షూట్ చేయడం వల్ల దగ్గర్లో హాస్పిటల్ కూడా లేదని, 3 గంటల పాటు ప్రయాణించి జైపూర్ వెళ్లాల్సి వచ్చిందని అప్పటి దుర్ఘటనను గుర్తుచేసుకున్నాడు గోపీచంద్. ఆ 3 గంటల పాటు రక్తం కారుతూనే ఉందని తెలిపాడు. గ్రేట్ ఆంధ్రకు ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో ఇలా తన యాక్సిడెంట్ గురించి బయటపెట్టాడు.

చిరంజీవి సైరా సినిమాకు పోటీగా చాణక్య వస్తుందనే అంశంపై కూడా గోపీచంద్ రియాక్ట్ అయ్యాడు. తన యాక్సిడెంట్ కారణంగా సినిమా లేట్ అయిందని, అందుకే దసరాను టార్గెట్ చేసుకొని సినిమాను పూర్తిచేశామన్నాడు. అప్పటికి సైరా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయలేదంటున్న గోపీచంద్.. దసరా బరిలో 2 సినిమాలకు స్కోప్ ఉంటుందని, తమ సినిమా కూడా ఆడుతుందనే ధీమాతో ఉన్నాడు.

పైగా దసరా సీజన్ మిస్ అయితే మళ్లీ అలాంటి సీజన్ లేదని, నిర్మాతలు కూడా ఆర్థికంగా ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో సైరా వచ్చిన 3 రోజులకు థియేటర్లలోకి వచ్చేస్తున్నామని స్పష్టంచేశాడు గోపీచంద్. 

చిరంజీవి గారి వల్లనే అవన్నీ సాధ్యం అయ్యాయి