మరోసారి జగన్ వైపు చూస్తున్న దక్షిణాది రాష్ట్రాలు

ఒక్కరోజు… ఒక్కటంటే ఒకే రోజు మాత్రమే మిగిలింది. అక్టోబర్ 1 నుంచి ఆంధ్రప్రదేశ్ లో సరికొత్త మద్యం పాలసీ అమల్లోకి రాబోతోంది. జగన్ చేపడుతున్న ఎన్నో విప్లవాత్మక చర్యల్లో ఇది కూడా ఒకటి. ఈ…

ఒక్కరోజు… ఒక్కటంటే ఒకే రోజు మాత్రమే మిగిలింది. అక్టోబర్ 1 నుంచి ఆంధ్రప్రదేశ్ లో సరికొత్త మద్యం పాలసీ అమల్లోకి రాబోతోంది. జగన్ చేపడుతున్న ఎన్నో విప్లవాత్మక చర్యల్లో ఇది కూడా ఒకటి. ఈ నూతన మద్యం పాలసీ ఎలా అమలవుతుందనే అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్ని ఆకర్షిస్తోంది. ఏపీలో ఇది సక్సెస్ అయితే మాత్రం మిగతా రాష్ట్రాలన్నీ జగన్ ను ఫాలో అవ్వడం ఖాయం. దానికి మరికొన్ని గంటలు మాత్రమే టైమ్ ఉంది.

పీపీఏల విషయంలో ఇప్పటికే సౌత్ కు ఆదర్శంగా నిలిచారు జగన్. ముఖ్యమంత్రి చూపించిన బాటలో దక్షిణాది మొత్తం నడిచేందుకు సిద్ధమౌతోంది. ఇప్పుడు మద్యం పాలసీతో కూడా మరోసారి అందరికీ ఆదర్శంగా నిలవబోతున్నారు జగన్. 1వ తేదీ నుంచి ప్రభుత్వం ఆధ్వర్యంలో మద్యం దుకాణాలు నడుస్తాయి. ఈ మేరకు ఉద్యోగ నియామక ప్రక్రియ కూడా చేపట్టారు జగన్. ఇక నుంచి ఉదయం 10 నుంచి రాత్రి 9 గంటల వరకే మద్యాన్ని విక్రయిస్తారు. కొనుగోలు విషయంలో కూడా కోటా విధించారు.

అధికారంలోకి వచ్చిన వెంటనే బెల్ట్ షాపుల్ని కట్టడి చేసిన ముఖ్యమంత్రి, ఇప్పుడు వ్యక్తిగత స్థాయిలో కొనుగోళ్లపై కూడా ఉక్కుపాదం మోపారు. ఒకప్పట్లా ఇష్టమొచ్చినట్టు మద్యం కొనుక్కొని ఇంట్లో పెట్టుకోవడానికి వీల్లేదు. ఫామ్ హౌజ్ లు, విల్లాల్లో మద్యం బాటిళ్ల కలెక్షన్ పెట్టుకోవడానికి అస్సలు వీల్లేదు. ఇకపై ఏ వ్యక్తి అయినా తన ఇంటి వద్ద 3 బాటిళ్లకు మించి మద్యాన్ని నిల్వ చేయడానికి వీల్లేదు.

బెల్ట్ షాపుల్ని తొలిగించినప్పుడు, మద్యం అమ్మకాల్ని ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకొచ్చినప్పుడే బ్లాక్ మార్కెట్ నియంత్రణపై ప్రత్యేకంగా దృష్టిపెట్టింది ప్రభుత్వం. మండల, జిల్లా కేంద్రాల నుంచి మద్యాన్ని కొనుగోలు చేసి, తమ సొంత గ్రామాల్లో ఇళ్లలో వాటిని పెట్టి బ్లాకులో అధిక ధరకు విక్రయించే ప్రమాదముందని ప్రభుత్వం ముందుగానే పసిగట్టింది. అందుకే ఇలా వ్యక్తిగత కొనుగోలు విషయంలో పరిమితి విధించింది.

కేవలం ఇక్కడితో ఆగలేదు వైసీపీ సర్కార్. ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ లో కూడా సమూల మార్పులు తీసుకొస్తోంది. గతంలో రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమలైనప్పుడు కేవలం ఎక్సైజ్ శాఖ నిర్లక్ష్యం, అవినీతి కారణంగానే అది విఫలమైంది. ఈసారి అలాంటి తప్పులు జరగకుండా ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ ను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేశారు జగన్. చాలామందిని డెప్యూటేషన్ మీద పంపించారు. మరికొందరిపై నిఘా పెట్టారు. మద్యం అక్రమ అమ్మకాల నిషేధానికి సంబంధించి అధికారులకు స్పష్టమైన గైడ్ లైన్స్ ఇచ్చారు.

ఓవైపు ఇన్ని చేస్తున్నప్పటికీ మరోవైపు చిన్నచిన్న పొరపాట్లు దొర్లుతూనే ఉన్నాయి. నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరులో ఓ వైన్ షాప్ ను మూసేయాల్సిందిగా స్థానిక మహిళలు చాన్నాళ్లుగా కోరుతున్నారు. ఇప్పుడేమో అదే వైన్ షాప్ ను ప్రభుత్వ మద్యం షాపుగా మార్చి తిరిగి అమ్మకాలకు రెడీ అవుతున్నారు.

ఈ సందర్భంగా మహిళలతో అధికారులు, పోలీసులు వ్యవహరించిన తీరు కూడా అభ్యంతరకరం. ఇలాంటి విషయాల్లో స్థానిక వైసీపీ నేతలు చూసీచూడనట్టు వ్యవహరించడం జగన్ కు అప్రతిష్ట తీసుకొస్తోంది. ఇలాంటి పొరపాట్లను ఎక్కడికక్కడ సరిదిద్దగలిగితే, మద్యం పాలసీలో కూడా జగన్ సూపర్ సక్సెస్ అయినట్టే. 

చిరంజీవి గారి వల్లనే అవన్నీ సాధ్యం అయ్యాయి