ఇప్పుడు వార్తలు రెండు రకాలుగా తయారయ్యాయి. ఒకటి తెలుసుకుని గ్యాసిప్ గా అందించడం. రెండు ఏదో ఒక గ్యాసిప్ పుట్టించేసి ఆ రోజుకు గడిచిపోయింది అనిపించేసుకోవడం. మెగాస్టార్ చిరంజీవిని హీరో ప్రభాస్ సైరా ప్రమోషన్ కోసం ఇంటర్వూ చేస్తారనే గ్యాసిప్ ఇలా పుట్టిందే. దీనికి సపోర్టింగ్ పాయింట్లు ఏమిటంటే, సాహో సినిమాకు రామ్ చరణ్ సాయం చేసాడని, ప్రభాస్ కు బాలీవుడ్ లో క్రేజ్ వుంది కాబట్టి, అది సైరాకు వాడతారు అని.
కానీ ఇది ప్యూర్ గాసిప్. ప్రభాస్ కు ఆ ఆలోచనా లేదు. రామ్ చరణ్ అడిగిందీ లేదు. దీంతో గ్యాసిప్ పుట్టించిన జనాలు, తరచు సైరా యూనిట్ కు ఫోన్ చేసి, ప్రభాస్ ఇంటర్వూ చేస్తారా? చేస్తారా? అని అడుగుడతున్నారని బోగట్టా. ప్రభాస్ ఎందుకు చేస్తాడు? అసలు ఎవరు చెప్పారు? అని సైరా యూనిట్ జనాలు ఎదురు అడగుతున్నారట.
సాహో సినిమా ఓ రేంజ్ వరకే ఆడింది. అలాంటి పరిస్థితుల్లో ప్రభాస్ ఎలా ఇంటర్వూ చేస్తాడు? కొంచెం అయినా ఇబ్బందికర పరిస్థితి వుంటుందా? వుండదా? ఆ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారో? ఈ గ్యాసిప్ పుట్టించిన వాళ్లు అన్న కామెంట్ లు సైరా యూనిట్ నుంచి వినిపిస్తున్నాయి.
ఇదిలావుంటే సైరా తెలుగు వెర్షన్ ప్రమోషన్ కు ఇక అట్టే టైమ్ మిగలలేదు. 29న బంగళూరు ఫంక్షన్ చూసుకుని మెగాస్టార్, రామ్ చరణ్ తదితరులు హైదరాబాద్ తిరిగివస్తారు. 30న మెగాస్టార్ – రామ్ చరణ్ కలిసి ఓ మీడియా మీట్ హోస్ట్ చేస్తారు.
వాస్తవానికి ఢిల్లీ వెళ్లాల్సి వుంది కానీ అది క్యాన్సిల్ చేసే అవకాశం వుంది. ఎందుకంటే అది క్యాన్సిల్ చేయకుంటే ఇక ఇక్కడ మీడియా మీట్ కు అవకాశం వుండదు. ఇక ఆపైన ఇంటర్వూలు, ప్రమోషన్లకు ఒకటవతేదీ ఒక్కటే గ్యాప్ వుంటుంది.