గంటా చేరేది ఖాయమే కానీ…?

గంటా శ్రీనివాసరావు విశాఖ జిల్లాలో బలమైన నేత. సామాజికవర్గం పెద్ద ఎత్తున ఉంది. ఆర్హ్దికంగానే కాదు, అన్ని విధాలుగా దమ్మున్న నేత. గంటా విషయంలో ఒక మాట ఉంది. ఆయన ఎపుడూ గెలిచిన పార్టీలోనే…

గంటా శ్రీనివాసరావు విశాఖ జిల్లాలో బలమైన నేత. సామాజికవర్గం పెద్ద ఎత్తున ఉంది. ఆర్హ్దికంగానే కాదు, అన్ని విధాలుగా దమ్మున్న నేత. గంటా విషయంలో ఒక మాట ఉంది. ఆయన ఎపుడూ గెలిచిన పార్టీలోనే ఉంటారు. అంటే దానర్ధం ఓడిన పార్టీలో ఉండరనేగా.

ఇదిలా ఉండగా గంటా వైసీపీలో చేరుతారా లేదా అన్న దానిపైన అఫీషియల్  స్టేట్మెంట్ కోసం మీడియా తెగ ప్రయత్నం చేస్తోంది. అయినా గంటా క్యాంప్ నుంచి మౌనమే సమాధానంగా ఉందిట.

గంటా తన అనుచరులతో చర్చించి ఒక నిర్ణయం తీసుకుని తానే స్వయంగా ప్రకటిస్తారని ఓ వైపు వినిపిస్తూంటే ఆయన ఆగస్ట్ 15న టీడీపీని వదిలేసి స్వేచ్చగా వైసీపీ కండువా కప్పుకుంటారని అంటున్నారు.

ఇవన్నీ ఇలా ఉంటే గంటా చేరికపైన వైసీపీలో భిన్న వాదనలు చర్చలు సాగుతున్నాయి. మంత్రి అవంతి శ్రీనివాస్ కి గంటాతో పడదు అన్నది తెలిసిందే. ఆయన్ని కూడా బుజ్జగించి దారికి తెచ్చే కార్యక్రమం కూడా ఈ గ్యాప్ లో జరుగుతుంది అంటున్నారు.

ఇక జగన్ ఒకసారి నిర్ణయం తీసుకుంటే ఆయన మాటే ఫైనల్, అంతా అనుసరించాల్సిందే అన్నది కూడా వైసీపీలో ఉంది. ఇవన్నీ పక్కన పెడితే గంటా కనుక వైసీపీలో చేరితే ఆయన పొలిటికల్ గా బిగ్ ఫిగర్ కాబట్టి టోటల్ గా  దున్నేస్తాడేమోనన్న భయం అధికార పార్టీ నేతల్లో ఉందిట. ఏది ఏమైనా గంటా చేరిక ఖాయమే అన్న మాట మాత్రం ఇపుడు గట్టిగానే వినిపిస్తోంది.

ఆర్జీవీకి సపోర్ట్ గా తరలి వచ్చిన ఫ్యాన్స్

నేను ఎప్పటికీ పవన్ భక్తుడినే