అక్కినేని అఖిల్‌ను పెళ్లాడాల‌నుకుంటున్న యాంక‌ర్‌

అక్కినేని అఖిల్‌…సిసింద్రీ న‌టుడిగా చాలా పాపుల‌ర్ అయ్యాడు. కెమెరా అంటే ఏమిటో తెలియ‌ని అతి చిన్న వ‌య‌స్సులో ల‌క్ష‌లాది మంది అభిమానాన్ని చూర‌గొన్న అఖిల్‌….ఆ త‌ర్వాత యంగ్ హీరోగా ఒక్క‌సారిగా అంద‌రికీ ప‌రిచ‌యం అయ్యాడు.…

అక్కినేని అఖిల్‌…సిసింద్రీ న‌టుడిగా చాలా పాపుల‌ర్ అయ్యాడు. కెమెరా అంటే ఏమిటో తెలియ‌ని అతి చిన్న వ‌య‌స్సులో ల‌క్ష‌లాది మంది అభిమానాన్ని చూర‌గొన్న అఖిల్‌….ఆ త‌ర్వాత యంగ్ హీరోగా ఒక్క‌సారిగా అంద‌రికీ ప‌రిచ‌యం అయ్యాడు. ఇప్పుడా యంగ్ హీరోపై ఓ బుల్లితెర హాట్ యాంక‌ర్ మ‌న‌సు పారేసుకుంది. మ‌న‌సంతా అఖిల్‌తో కూడిన ఆలోచ‌న‌లే. చేతిపై అఖిల్ టాటూ వేయించుకుందంటే అత‌న్ని ఎంత‌గా ఇష్ట‌ప‌డుతున్న‌దో అర్థం చేసుకోవ‌చ్చు.

అఖిల్‌ను పెళ్లి చేసుకోవాల‌ని క‌ల‌లు కంటున్న ఆ అల్ల‌రి యాంక‌ర్ పిల్లే విష్ణుప్రియ‌.  ‘పోరా పోవే’ ప్రోగ్రాం యాంకర్‌గా విష్ణుప్రియ అంద‌రినీ ఆక‌ట్టుకున్నారు. నెటిజ‌న్ల‌కు కూడా చాలా ప్రియ‌మైన యాంక‌ర్ కూడా. సోష‌ల్ మీడియాలో చేసే హ‌డావుడి త‌క్కువేం కాదు. త‌న అంద‌చందాల ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులకి వినోదాన్ని పంచ‌డంలో విష్ణుప్రియ ముందు వ‌రుస‌లో ఉంటారు.

ఈ హాట్ యాంక‌ర్‌కు బిగ్‌బాస్ ఫేమ్‌, హాట్ యాంక‌ర్ శ్రీ‌ముఖి స‌న్నిహితురాలు. ఇటీవ‌ల ఎక్క‌డ చూసినా ఈ యాంక‌ర్ జంటే క‌నిపిస్తోంద‌ని టాక్‌. దీంతో ప‌ర‌స్ప‌రం  మ‌న‌సును  పంచుకున్నారు.

తాజాగా విష్ణుప్రియ‌కు సంబంధించిన సీక్రెట్‌ను శ్రీ‌ముఖి బ‌హిరంగప‌రిచి అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. వీరిద్దరూ కలిసి ఓ షోకి హాజ‌ర‌య్యారు. ఆ షో హోస్ట్  సీనియ‌ర్ యాంక‌ర్ ఝాన్సీ . వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక‌ సీక్రెట్  చెప్పాలని ఝాన్సీ కోరారు. దీంతో  శ్రీముఖి ఏ మాత్రం ఆల‌స్యం, ఆలోచ‌న చేయ‌కుండా.. తన స్నేహితురాలైన విష్ణుప్రియకు సంబంధించిన సీక్రెట్‌ను బ‌య‌టికి చెప్పేశారు.

‘విష్ణుప్రియకు అక్కినేని అఖిల్ అంటే ఎంతో ఇష్టం. ఎంత ఇష్టమంటే.. అతడిని పెళ్లిచేసుకోవాలనేంత. దేవుడు ప్రత్యక్షమై ఏదైనా కోరుకోమని అడిగితే.. అఖిల్‌ని పెళ్లి చేసుకుంటానని అడుగుతుంద‌ట‌. విష్ణుప్రియ చేతిపై అఖిల్ టాటూ కూడా ఉంటుంది చూడండి’ అంటూ విష్ణుప్రియ మనసులోని సీక్రెట్‌ను శ్రీముఖి వెల్ల‌డించారు. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. విష్ణుప్రియ ఇష్టాన్ని అఖిల్ ఎలా స్వీక‌రిస్తారో మ‌రి! 

ఆర్జీవీకి సపోర్ట్ గా తరలి వచ్చిన ఫ్యాన్స్