అమితాబ్ కు కరోనా తగ్గిపోయిందా?

కొన్ని రోజుల కిందట కరోనాతో హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్. ముంబయిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో ప్రస్తుతం ఆయన ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. అయితే ఇంతలోనే…

కొన్ని రోజుల కిందట కరోనాతో హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్. ముంబయిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో ప్రస్తుతం ఆయన ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. అయితే ఇంతలోనే ఓ వార్త.

అమితాబ్ కు మరోసారి కరోనా పరీక్షలు చేశారంట. ఈసారి ఆయనకు నెగెటివ్ వచ్చిందట. ఏకంగా ఓ ప్రముఖ జాతీయ ఛానెల్ ఇలా చెప్పడంతో పాటు పెద్ద చర్చా కార్యక్రమం కూడా పెట్టేసింది. మరో అడుగు ముందుకేసి రేపోమాపో డిశ్చార్జ్ అవుతారంటూ కథనం ఇచ్చేసింది. దీంతో బిగ్ బి ఫ్యాన్స్ అంతా పండగ చేసుకున్నారు. చాలామంది అమితాబ్ ను ట్యాగ్ చేస్తూ శుభాకాంక్షలు కూడా చెప్పేశారు.

అయితే ఇదంతా ఫేక్. ఈ మొత్తం వ్యవహారంపై హాస్పిటల్ నుంచి స్వయంగా అమితాబ్ బచ్చన్ స్పందించారు. సదరు ఛానెల్ ప్రసారం చేసిన వార్త పూర్తిగా అవాస్తవమని, బాధ్యతారాహిత్యంగా ఉందని మండిపడ్డారు.

ఈనెల 12న నానావతి హాస్పిటల్ లో అమితాబ్, అభిషేక్ జాయిన్ అయ్యారు. ఐశ్వర్య, ఆమె కూతురు ఆరాధ్యకు ప్రారంభంలో ఇంట్లోనే ట్రీట్ మెంట్ ఇచ్చినప్పటికీ తర్వాత వాళ్లు కూడా అదే హాస్పిటల్ కు షిఫ్ట్ అయ్యారు. ప్రస్తుతం వీళ్లందరికీ చికిత్స కొనసాగుతోంది. ఇంతలోనే కరోనా తగ్గిపోయిందంటూ తనపై వార్తలు రావడంతో అమితాబ్ ఆగ్రహం వ్యక్తంచేశారు.

నేను ఎప్పటికీ పవన్ భక్తుడినే